BigTV English

AP Smart Meter Issue: కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా? ఇక ఆ భారానికి సెలవేనా?

AP Smart Meter Issue: కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా? ఇక ఆ భారానికి సెలవేనా?

AP Smart Meter Issue: ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల ద్వారా వచ్చే విద్యుత్ బిల్లులపై వినిపిస్తున్న విమర్శలు అధికార యంత్రాంగం దృష్టిలోకి వచ్చాయి. చాలా మంది వినియోగదారులు తమకు అసాధారణంగా అధిక విద్యుత్ బిల్లులు వస్తున్నాయని మండిపడుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పందించారు. ప్రజలు చెల్లించే ప్రతి రూపాయి న్యాయమైనదే కావాలని స్పష్టంగా చెప్పారు. ఇదే విషయంపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మంత్రి. ఆ నిర్ణయం ఏమిటనేది ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిందే.


దోచేస్తున్న స్మార్ట్ మీటర్?
గత కొద్ది నెలలుగా, గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ కొంతమంది వినియోగదారులు తమ కరెంట్ బిల్ కు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్వం కంటే తక్కువ కరెంట్ వాడినా బిల్లు ఎక్కువగా వస్తోంది, స్మార్ట్ మీటర్ వేయించిన తరువాతే లెక్కలు తారుమారయ్యాయి అంటూ పలువురు వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా, ప్రజా ప్రతినిధుల ద్వారా తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ పరిస్థితుల్లో మంత్రి గొట్టిపాటి సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించడంతో ఇప్పుడు కరెంట్ బిల్ సమస్య మరింత జటిలమైంది.

స్మార్ట్ మీటర్ బిల్లులు ఎక్కువవుతున్నాయా? అసలేం జరుగుతోంది?
సాధారణంగా స్మార్ట్ మీటర్లు టైమ్ బేస్డ్ యూజ్, రియల్ టైం మానిటరింగ్ లాంటి టెక్నాలజీని ఉపయోగించి ఖచ్చితమైన లెక్కలు చూపిస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక లోపాలు, ట్రాన్స్‌మిషన్ ఇష్యూలు, లేదా డేటా రీడింగ్ లో తప్పుల వల్లే బిల్లింగ్ లో ఇబ్బందులు వచ్చి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సోమవారం నాటికి సమగ్ర నివేదికను సమర్పించాలంటూ విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు.


ఎవరికీ అన్యాయం జరగదని మంత్రి హామీ
మంత్రి ఇదే విషయంపై మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లు ఎక్కువ వచ్చిందని కొన్ని చోట్ల ఆరోపణలు వచ్చాయి. ఇది మా దృష్టికి వచ్చింది. అయితే ఎవరికీ అనవసరంగా ఒక్క రూపాయి కూడా భారం మోపకూడదనే ఉద్దేశంతో, తక్షణమే విచారణకు ఆదేశించామని చెప్పారు.
ఇది కేవలం విమర్శలపై స్పందన కాదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే చర్యగా వివరించారు. అలాగే, నివేదికలో తప్పిదాలెక్కడ ఉన్నాయో, ఏయే ప్రాంతాల్లో సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయో స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు భరోసా.. తప్పు జరిగితే చర్యలు ఖచ్చితమే
ప్రభుత్వం తరఫున మంత్రి చెప్పిన మాటల్లో స్పష్టత ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలకు ఇబ్బంది కలిగించడమే కాదు, ప్రతి వినియోగదారుని హక్కును కాపాడేందుకు ప్రభుత్వం ముందుంటుందని, సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. అవసరమైతే సంస్థలపైన కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని చెప్పారు. అలాగే, తప్పుడు బిల్లింగ్ విషయంలో ప్రజలు ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌లు, అప్లికేషన్ ద్వారా సదుపాయాలు ఉండేలా చూస్తామన్నారు.

Also Read: Vizag vs Visakhapatnam: విశాఖ.. వైజాగ్ ఎలా? ఆ ఒక్కటి తెలిస్తే.. అలా అస్సలు పిలవరేమో!

వినియోగదారుల బాధలను అర్థం చేసుకుంటున్న ప్రభుత్వం
స్మార్ట్ మీటర్లు అనేవి కాలానుగుణంగా అభివృద్ధి చెందిన వ్యవస్థ. అయితే టెక్నాలజీ అందరికీ ప్రయోజనకరంగా ఉండాలే తప్ప, భారం మోపే సాధనంగా మారకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి, తక్షణమే స్పందించి మంత్రి స్థాయిలో విచారణ ఆదేశించడం మంచి పరిణామంగా భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరి మీకు కూడా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందా?
ఈ నేపథ్యంలో మీరు కూడా బిల్లింగ్ పై అనుమానంగా భావిస్తే, మీ స్థానిక విద్యుత్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఆధారాలు, మీ గత వినియోగ వివరాలు చూపించి సమస్యను నమోదు చేయవచ్చు. తక్షణమే విచారణ జరుగుతుంది. త్వరలో ప్రభుత్వం నుంచి హెల్ప్ లైన్, ఫిర్యాదు దరఖాస్తులపై మరింత సమాచారం కూడా వెలువడే అవకాశం ఉంది.

ఏపీలో స్మార్ట్ మీటర్లపై ప్రజల్లో ఉన్న అనుమానాలు ప్రభుత్వ దృష్టికి వెళ్లడం, వెంటనే మంత్రి స్థాయిలో స్పందన రావడం ఒక విశ్వాసాన్ని కలిగిస్తోంది. కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చినట్లు అనిపిస్తే అది తప్పు కాకపోయినా, ప్రజల మాట వినడమే నిజమైన పాలన అని విద్యుత్ శాఖ చూపించింది. సోమవారం వచ్చే నివేదికలో నిజాలు వెలుగు చూస్తే, ప్రభుత్వం తీసుకొనే చర్యలు ప్రజల మెప్పు పొందేలా మారవచ్చు!

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×