OTT Movie : కేరళలోని పేయవూర్ అనే మారుమూల గ్రామంలో, అర్ధరాత్రి… ఒక రచయిత్రి ఒంటరిగా తన గదిలో ఉంటుంది. అకస్మాత్తుగా ఒక దెబ్బతో నేలకొరుగుతుంది. ఆమె చుట్టూ కొన్ని నీడలు కదులుతాయి. పూవరసి మన అనే పాత ఇంటి గోడల నుండి గుసగుసలు వినిపిస్తాయి. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారు? ఈ ఇంట్లో దాగిన రహస్యాలు ఆమె జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి? ఈ రాత్రి ఆమెకు సమాధానాలను ఇస్తుందా? లేక మరింత భయంకరమైన రహస్యాలను వెలికితీస్తుందా? అనేది తెలియాలంటే ఈ హారర్ థ్రిల్లర్ కథ ఏంటి? ఏ ఓటీటీలో ఉందో ముందు తెలుసుకోవాలి.
కథలోకి వెళ్తే…
పేయవూర్ అనే గ్రామంలో ఒక రచయిత్రి (ప్రియాంక నాయర్)పై దాడి జరుగుతుంది. కానీ ఆ దాడి ఎవరు చేశారో తెలియదు. ఈ దాడి గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ చేయడానికి పూవరసి మన అనే పాత ఇంటికి చేరుకుంటారు. ఇక్కడే రచయిత్రి కొన్ని భయంకరమైన రహస్యాలను కనిపెడుతుంది. నిజానికి ఆ గ్రామంలో ఈ ఇంటికి ఒక చరిత్ర ఉంటుంది. దెయ్యాల ఇల్లు అని పిలుచుకోవడమే కాదు, ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా జనాలు భయపడతారు.
అలాంటి ఇంట్లో అడుగు పెట్టిన రచయిత్రి కొన్ని షాకింగ్ విషయాలను కనిపెడుతుంది. ఇక ఆమెపై జరిగిన దాడి తరువాత గ్రామస్థుల జీవితాలను, వారి గతాన్ని ఇన్వెస్టిగేషన్ ద్వారా మరోసారి రీఓపెన్ చేస్తారు. విచారణలో పోలీసు అధికారి (టీజీ రవి) టీం రచయిత్రి గతానికి, ఈ ఇంటి రహస్యాలతో సంబంధం ఉందన్న విషయాన్ని బయట పెడతారు. హీరోతో పాటు ఇతర స్థానికులు కూడా ఈ కేసులో చిక్కుకుంటారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ గ్రామీణ నేపథ్యంలో సాగే భయంకరమైన హర్రర్ మూవీ. ఇందులో సస్పెన్స్, ఊహించని ట్విస్టులు మెండుగా ఉంటాయి. ఇంతకీ ఆ లేడీ రైటర్ కు, ఆ ఇంటికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఆమెపై దాడి చేసింది ఎవరు, ఎందుకు అన్న విషయాలను పోలీసులు కనిపెట్టారా? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీపై ఓ లుక్కేయాల్సిందే.
Read Also : కూతురి బాయ్ ఫ్రెండ్ పై మనసు పడే తల్లి… ఇదెక్కడి దిక్కుమాలిన కథరా సామీ
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మలయాళ మిస్టరీ థ్రిల్లర్ పేరు ‘Karnika’. 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ 10 నెలల తరువాత ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ManoramaMAX, Simply South ఓటీటీలలో అందుబాటులో ఉంది. ఇందులో ప్రియాంక నాయర్, వియాన్ మంగళశేరి, టీజీ రవి, క్రిస్ వేణుగోపాల్, ఆదవ్ రామచంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. అరుణ్ వెన్‌పాల ఈ మూవీకి దర్శకత్వం వహించారు.