AP EAPCET 2025: ఆదివారం సాయంత్రం ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు(AP EAPCET 2025 Results) ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ – ఫార్మసీ పలువురు స్టూడెంట్స్ అత్యుత్తమ ప్రదర్శనతో మెరిశారు. అయితే.. టాప్ 10 ర్యాంకర్ల జాబితాలో అందరూ అబ్బాయిలే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే హైదరాబాద్‌లో మొత్తంగా 145 కేంద్రాలలో నిర్వహించిన ఈ పరీక్షకు 3లక్షల 62వేల 448మంది అప్లై చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 3లక్షల 40వేల 300మంది ఎగ్జామ్ కు హాజరైనట్లు వెల్లడించారు. వీరిలో 2లక్షల 57వేల 509మంది (75.67% ఉత్తీర్ణత) అర్హత సాధించారని వివరించారు పరీక్షలు నిర్వహించిన తక్కువ కాల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేయడం పట్ల వీసీ ఆచార్య సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.
ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన అవనగంటి అనిరుధ్ రెడ్డి 96.39 స్కోరుతో ఫస్ట్ ర్యాంక్ సాధించి సత్తా చాటగా.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మాండవ్యపురం భాను చరణ్ రెడ్డి 95.57 స్కోరుతో రెండో ర్యాంకు సాధించాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 94.75 స్కోరుతో మూడో ర్యాంకు సాధించాడు.
ఇంజినీరింగ్ విభాగంలో..
⦿ అనిరుధ్ రెడ్డి – ఫస్ట్ ర్యాంక్ (హైదరాబాద్, వనస్థలిపురం)
⦿ భానుచరణ్ రెడ్డి – సెకండ్ ర్యాంక్ (శ్రీకాళహస్తి, తిరుపతి)
⦿ యశ్వంత్ సాత్విక్ – మూడో ర్యాంక్ (పశ్చిమగోదావరి, పాలకొల్లు)
⦿ రామచరణ్ రెడ్డి – నాలుగో ర్యాంకు (తిమ్మాపురం, నంద్యాల జిల్లా)
⦿ యు. రామచరణ్ రెడ్డి – నాలుగో ర్యాంకు (తిమ్మాపురం, నంద్యాల జిల్లా)
⦿ భూపతి నితిన్ అగ్నిహోత్రి – ఐదో ర్యాంకు (అనంతపురం న్యూటౌన్)
⦿ టి.విక్రమ్ లేవి – ఆరో ర్యాంకు (గుంటూరు)
⦿ దేశిరెడ్డి మణిదీప్ రెడ్డి – ఏడో ర్యాంకు (చిత్తూరు జిల్లా)
⦿ ఎస్. త్రిశూల్ – ఎనిమిదో ర్యాంకు (వడ్డేపల్లి, హన్మకొండ)
⦿ ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి – తొమ్మిదో ర్యాంకు (నరసన్నపేట- శ్రీకాకుళం)
⦿ భద్రిరాజు వెంకటమణి ప్రీతమ్ – పదో ర్యాంకు ( కందుకూరు- పొట్టిశ్రీరాములు నెల్లూరు)
ALSO READ: Snake News: పాములు లేని బ్యూటిఫుల్ దేశం ఏదో తెల్సా.. ఇదిగో వీడియో చూడండి..
అగ్రి, ఫార్మసీ విభాగంలో..
⦿ రామాయణం వెంకట నాగసాయి హర్షవర్దన్- (పెనమలూరు, కృష్ణా జిల్లా)
⦿ షన్ముఖ నిశాంత్ అక్షింతల – చందానగర్, రంగారెడ్డి జిల్లా
⦿ డేగల అకీరనంద వినయ్ మల్లేశ్ కుమార్ – ఆలమూరు, కోనసీమ
⦿ వై.షణ్ముఖ్ – వడ్డేపల్లి, హన్మకొండ
⦿ యెలమోలు సత్య వెంకట్ – తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి
⦿ సిరిదెళ్ల శ్రీ సాయి గోవర్దన్ – పెద్దాపురం, కాకినాడ
⦿ జి. లక్ష్మీ చరణ్ – సీతమ్మధార, విశాఖ
⦿ దర్భ కార్తిక్ రామ్ కిరీటి- రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి
⦿ కొడవటి మోహిత్ శ్రీరామ్ – చాగళ్లు, తూర్పుగోదావరి
⦿ దేశిన సూర్య చరణ్ – తొండంగి, కాకినాడ
ALSO READ: DRDO: డీఆర్‌డీవోలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.56,100 జీతం, ఇంకా 2 రోజులే?