BigTV English

Vizag vs Visakhapatnam: విశాఖ.. వైజాగ్ ఎలా? ఆ ఒక్కటి తెలిస్తే.. అలా అస్సలు పిలవరేమో!

Vizag vs Visakhapatnam: విశాఖ.. వైజాగ్ ఎలా? ఆ ఒక్కటి తెలిస్తే.. అలా అస్సలు పిలవరేమో!

Vizag vs Visakhapatnam: ఏపీలో మహానగరంగా వెలుగొందుతోన్న విశాఖపట్టణం.. దేశంలోనే ప్రముఖ నౌకాశ్రయంగా, పరిశ్రమల హబ్‌గా, పర్యాటక పరంగా ఆకర్షణగా నిలుస్తోంది. కానీ ఈ నగరానికి మరో పేరు ఉంది వైజాగ్. ఇదే విశాఖనే ఎందుకు వైజాగ్ అని పిలుస్తారు? ఒకే నగరానికి రెండు పేర్లు ఎందుకు వచ్చాయి? ప్రజలు రెండింటినీ ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఈ గుట్టును ఇప్పుడు తెలుసుకోవాల్సిందే.


విశాఖపట్టణం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది.. సముద్రతీరంలోని అందమైన నగరం, ఇండియన్ నేవీకి గర్వకారణంగా నిలిచిన నౌకాదళ స్థావరం, ఎవరైనా ఓ టూర్‌కు వెళ్లాల్సి వస్తే ముందుగా గుర్తుకొచ్చే బీచ్ సిటీ. కానీ ఇదే విశాఖ నగరాన్ని చాలామంది వైజాగ్ అని కూడా పిలుస్తుంటారు. అసలు విశాఖ అంటే వైజాగ్ ఎలా అయింది? ఒక్క నగరానికి రెండు పేర్లు ఎందుకు పెట్టారు? ఇవి ఒకటేనా? వేరేనా? ఇది చాలా మందికి ఉన్న కన్‌ఫ్యూజన్.

విశాఖపట్టణం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ఈ నగరానికి పేరు చాలా కాలం క్రితం నుంచే ఉంది. పురాణాల ప్రకారం, విశాఖేశ్వరుడు అనే శివుడికి అంకితమైన ఆలయం ఒకప్పుడు సముద్రతీరంలో ఉండేది. అదే ఆలయం చుట్టూ గ్రామం ఏర్పడినప్పుడు దీనికి విశాఖపట్టణం అని పేరు వచ్చిందట. మరికొంతమంది చరిత్రకారులు చెబుతున్న సంగతి ఏంటంటే, బౌద్ధ కాలంలో విశాఖదత్త అనే ప్రముఖ బౌద్ధ శిష్యుడు ఇక్కడ ఉన్నాడట. ఆ పేరునే నగరానికి పెట్టారట. రెండు కథల్లో ఏది నిజమైనదో చెప్పలేకపోయినా ఈ పేరు చాలా పాతదని మాత్రం స్పష్టమవుతుంది.


వైజాగ్ ఎలా అయ్యిందంటే?
బ్రిటిష్ వాళ్లు ఇండియాను పాలిస్తున్న సమయంలో విశాఖపట్టణం వైపు కూడా వచ్చారు. అప్పుడు వాళ్లకు Visakhapatnam అనే పేరు పలకడం కాస్త కష్టంగా అనిపించింది. దాంతో వాళ్లు దీన్ని Vizagapatam అని పిలవడం మొదలుపెట్టారు. ఆంగ్లంలో పట్నం అన్న పదం పటం లేదా పటమ్ అనేలా మార్చడమవుతుందంతే. Vizagapatam అని పలుకుతూ పలుకుతూ.. ఆ పేరు ఇంకాస్త చిన్నదిగా Vizag అని మారిపోయింది. కాలక్రమేణా దాన్ని తెలుగులో వైజాగ్ అని పిలవడం మొదలుపెట్టారట.

అసలు విషయం ఏమిటంటే?
ఇక్కడే కిక్కుంది.. బ్రిటిష్ వాళ్లతో వచ్చిన Vizag అనే పేరు, ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందింది. పాస్‌పోర్ట్ నుంచి రైలు స్టేషన్ల వరకూ ఇంగ్లీషులో Visakhapatnam అని ఉంటే, విమానాశ్రయంలో మాత్రం మీరు Vizag Airport అని చదవచ్చు. ఇలా రెండు పేర్లు ఒకే లెవెల్ లో నడుస్తున్నాయి.

విశాఖ, వైజాగ్ రెండూ వేర్వేరు నగరాలా?
ఇక్కడే చాలా మందికి డౌట్. రెండూ వేరే అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే విశాఖపట్టణం, వైజాగ్ ఒకటే. తేడా ఏంటంటే.. ఒకటి అధికారిక పేరు, మరొకటి చిట్కా పేరు.
ప్రభుత్వ ఫైల్స్‌లో, పత్రికల్లో, న్యాయపరంగా చూసే పేరు విశాఖపట్టణం. కానీ ప్రజల మాటల్లో, నిత్య వాడుకలో, ట్రావెల్ వ్లాగ్స్, సినిమాల్లో వినిపించే పేరు వైజాగ్.

Also Read: AP Farmers: ఒకేరోజు రెండు స్కీమ్స్.. అకౌంట్లోకి డబ్బులే డబ్బులు.. చెక్ చేసుకోండి!

మన దేశ నౌకాదళం కూడా ఈ నగరాన్ని Vizag పేరుతోనే గుర్తిస్తుంది. అందుకే INS Vizag అనే నౌకా స్థావరానికి ఈ పేరు పెట్టారు. ఇది బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన నౌకా కేంద్రం ఆధారంగా వచ్చింది. అలా ఈ పేరు ప్రభుత్వ వ్యవస్థలోనూ, రక్షణ శాఖలోనూ స్థిరపడిపోయింది.

ప్రజల మనసుల్లో రెండు పేర్లకూ స్థానం
ప్రజల విషయానికి వస్తే, విశాఖ బీచ్ కి పోదామా? అంటారు. వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేద్దామా? అంటారు. పేరు ఏదైనా.. ప్రేమ ఒకటే. ఈ నగరాన్ని పిలిచే విధానం మారినా, భావం మారదు. అదే అందం, అదే అభివృద్ధి, అదే గర్వం. ఇక చాలామంది టూరిజం ప్రమోషన్లలో కూడా వైజాగ్ ను వాడుతున్నారు. ఎందుకంటే ఇది సులువుగా పలికే పేరు. అదే సమయంలో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసే పదమూ Vizag అనే మాటేనట.

విశాఖపట్టణం ఇది చరిత్రతో నిండిన పేరు. వైజాగ్ ఇది ఆధునికతకి, గ్లోబల్ గుర్తింపుకు నిదర్శనం. ఒక్క నగరమే అయినా.. రెండు పేర్లు సంప్రదాయం, సమయానికి తగినట్టు ప్రవర్తించాయి. అందుకే గర్వంగా చెప్పుకోవచ్చు.. విశాఖ అంటే వైజాగ్, వైజాగ్ అంటే విశాఖ!

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×