E-Paper
Advertisement

AP Flamingo Festival: నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్.. వ్యూపాయింట్స్, బోటింగ్ ఇక్కడే.. ఉచిత బస్సులు కూడా

AP Flamingo Festival: నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్.. వ్యూపాయింట్స్, బోటింగ్ ఇక్కడే.. ఉచిత బస్సులు కూడా
Advertisement

AP Flamingo Festival: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ కు రెడీ అయింది. నేటి నుంచి మూడ్రోజుల పాటు ఈ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 12న ఫ్లెమింగో ఫెస్టివల్‌ ముగింపు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. నేలపట్టు, అటకానితిప్ప ప్రాంతాల్లో ఫ్లెమింగో వ్యూ పాయింట్లను సందర్శించనున్నారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో నిర్వహించే ఉత్సవంలో సీఎం పాల్గొంటారు.

పులికాట్ తీరంలో

పులికాట్‌ సరస్సు తీరంలో.. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ‘ఫ్లెమింగో ఫెస్టివల్‌’ నిర్వహించనున్నారు.. ఈ ఫెస్టివల్ ను ముందుగా రెండు రోజులే నిర్వహించాలనుకున్నారు. అయితే టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉండడంతో మరో రోజుకు పెంచినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. ఈ ఉత్సవాలు నిర్వహించే జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో ఏర్పాట్లను ఎస్పీ, ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. పులికాట్ సరస్సు చుట్టూ ఉన్న ముఖ్య ప్రదేశాలలో పర్యావరణం, పర్యాటకం, సంస్కృతి, సమాజ భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ ఫ్లెమింగో ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ఫ్లెమింగో వ్యూ పాయింట్లు:

Advertisement

• నేలపట్టు పక్షుల అభయారణ్యం
• అటకానితిప్ప
• బీవీ పాలెం పాయింట్
• ఉబ్బలమడుగు జలపాతాలు
• ఇరుక్కం ద్వీపం

ముఖ్యాంశాలు

• నేలపట్టు, సూళ్లూరుపేట, బీవీ పాలెం నుంచి ఉచిత బస్సు సదుపాయం
• సూళ్లూరుపేటలో ఫెస్ట్ ప్రధాన వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు
• శ్రీ సిటీ, శ్రీహరికోట, చేనేత కళాకారులు, ప్రభుత్వ విభాగాల స్టాళ్లు ఏర్పాటు
• బీవీ పాలెంలో బోటింగ్, పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్

ట్రిప్ ధరలు

Advertisement

• 40 నిమిషాల బోటింగ్- రూ.30
• ఇరుక్కం దీవి రౌండ్ ట్రిప్- రూ.100

సెక్యూరిటీ

• ట్రాఫిక్, ప్రజల భద్రత కోసం నిరంతరం సీసీటీవీ, డ్రోన్ నిఘా
• ప్రభుత్వ ఖర్చుతో 6,000 మంది విద్యార్థులు ఫెస్టివల్ ను సందర్శించనున్నారు.

Related News

అవకాశం ఉంటే రే*ప్ కేసు కూడా పెట్టేవారేమో! నల్లపాడు పోలీసులపై అంబటి షాకింగ్ కామెంట్స్

కౌంటింగ్‌కు ముందు రోజే మరణం.. వైసిపిపై 352 ఓట్లతో జనసేన MPTCగా ఘన విజయం!

ఇల్లత్తూరు ఎంపీటీసీ ఫలితంపై ఉద్రిక్తత.. మాజీ మంత్రి రోజా ధర్నా..!

బాలకృష్ణ పీఏ ఎంట్రీతో రాజుకున్న వివాదం.. హిందూపురం కౌంటింగ్ సెంటర్ వద్ద రచ్చ రచ్చ!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో కూటమి హవా.. పులివెందులలో టీడీపీ విక్టరీ.. ఇంకా ఎక్కడెక్కడ గెలిచారంటే?

పులివెందులలో హోరా హోరీ.. ఆధిక్యంలో వైసీపీ పార్టీ.. వెనుకంజలో టీడీపీ!

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు నేడే.. ఓట్ల లెక్కింపు షురూ.. కౌంటింగ్ కేంద్రాల్లో టెన్షన్ టెన్షన్!

చీరాలలో కాంగ్రెస్ సంచలనం.. కూటమికి వైఎస్ షర్మిలా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!

Big Stories

Advertisement
×