E-Paper
Advertisement

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్!

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్!
Advertisement

AgriGold Lands: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ భూముల పై ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటి వరకు మూడు సమావేశాలు జరిగాయని అన్నారు. ఇవాళ కొన్ని నిర్ణయలు తీసుకున్నామని, అగ్రిగోల్డ్ డిపాజిటర్లు నిజమైన బాధితులకు అగ్రిగోల్డ్ ఆస్తుల్లో 20 వేల ఎకరాల భూమి ఏపీలో ఉందని అన్నారు. 6 వేల ఎకరాల పైగా భూమి ఆక్షన్ కు సిద్ధంగా ఉందని, త్వరగా ఆక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టాలని సీఐడీని కోరామని మంత్రి తెలిపారు.

5 లక్షల మంది ఏజెంట్లు..

గత మీటింగ్‌లో మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి పోలీసు శాఖకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అగ్రిగోల్డ్ కు 5 లక్షల మంది ఏజెంట్లు పని చేస్తున్నారని, 6 వేల కోట్లు డిపాజిట్లుగా తీస్కున్నారని అన్నారు. 3 వేల కోట్లు ఏపీ నుంచే తీస్కున్నారని, 18 లక్షల 57 వేల 290 మందికి ప్లాట్లు ఉన్నాయని చెప్పి డిపాజిట్ తీస్కున్నారని గుర్తు చేశారు. దీనిసై చాలా లోతుగా కసరత్తు జరగాలని మంత్రి తెలిపారు. సరైన యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, ప్రజలకు తెలిసేలా ఒక వెబ్ సైట్ ఓపెన్ చేస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు

సెప్టెంబర్ 15 లోపు..

సమావేశంలో 9 రాష్ట్రాల నుంచి ఏజెంట్లు వచ్చారని, ఏ రాష్ట్రంలో వారు అక్కడ బాండ్లు ఇస్తామని చెప్పారని అన్నారు. పోలీస్ శాఖతో సంప్రదించి, ఎక్కడికక్కడ బాండ్లు తీసుకోడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని సీఎం ని కోరామరని తెలిపారు. ఈ నెల 11న సీఎస్ తో కలిపి సమావేశం ఏర్పాటు చేస్తున్నాని, ఆగస్ట్ 15 లోపు స్పెషల్ కోర్ట్ ఏర్పాటు జరగాలని కోరుతున్నామన్నారు. ఆక్షన్ విషయంలో విధి విధానాల 11 లోపు పూర్తి చేస్తామని, విడతల వారీగా ఇకపై అన్ని నిర్ణయాలు ఉంటాయన్నారు. సీఎం ఆదేశాల ప్రకారం స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేస్తాంమని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు.

Advertisement

Also Read: తెలంగాణ సీపీగెట్ ఫలితాలు విడుదల

Tags

Related News

తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన.. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే ఛాన్స్

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

Big Stories

Advertisement
×