Nepal: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రి నారా లోకేష్. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం తరపున స్పెషల్ ఫ్లైట్ నేపాల్‌కు వెళ్తోందన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మంత్రి. పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామన్నారు. చిక్కుకున్న వారికి భరోసా ఇవ్వడంతో పాటు ఎంబసీ ద్వారా కావాల్సిన ఏర్పాట్లు చేశామన్నారు లోకేష్.
నేపాల్‌లో 217 మంది ఏపీ పర్యాటకులు చిక్కుకున్నారు: మంత్రి లోకేష్
ఏపీ భవన్‌లో టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి నేపాల్‌లోని తెలుగువారిని గుర్తించామన్నారు మంత్రి లోకేష్. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం.. వేర్వేరు ప్రాంతాల్లో 217 మంది రాష్ట్ర వాసులు ఉన్నారని తెలిపారు. కాఠ్‌మాండూ నుంచి ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో వారందరినీ రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. నేపాల్‌లో ఉన్న ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నేపాల్ నుంచి వచ్చే ప్రత్యేక విమానం విశాఖ, కడపకు చేరుకుంటుందని వివరించారు మంత్రి.
ఖాట్మాండు నుంచి ప్రత్యేక విమానంలో వీరిని రాష్ట్రానికి తీసుకొస్తాం- మంత్రి లోకేష్
ప్రధానంగా ఖాట్మండు నుంచి ఆంధ్రావారిని తీసుకువచ్చేందుకు ఇవాళ మధ్యాహ్నం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక ప్రత్యేక విమానం ఖాట్మండులో దిగి, అక్కడి నుంచి ఏపీ పౌరులందరినీ మొదటి హాల్ట్ విశాఖ, రెండో హాల్ట్ కడపకు తీసుకు వస్తుందని తెలిపారు లోకేష్. ఇందులో భాగంగా కాసేపట్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌కు వెళ్లనున్నారు మంత్రి లోకేశ్. సిమికోట్‌లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో యూపీ బోర్డర్ సమీపంలో ఉన్న నేపాల్‌గంజ్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు.
Also Read: తీవ్ర విషాదం.. తెలుగురాష్ట్రాల్లో పిడుగులు పడి తొమ్మిది మంది మృతి
ప్రత్యేక వాహనాల్లో లక్నో చేరుకున్న తెలుగు వాళ్లు
అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో లక్నో చేరుకోనున్నారు తెలుగు వారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అధికారులతో ప్రత్యేకంగా సమన్వయం చేసుకొని మాట్లాడారు మంత్రి నారా లోకేశ్. హిటోడాలో ఉన్న మరో 22 మంది రోడ్డు మార్గం ద్వారా బీహార్ సరిహద్దులోని రాక్సాల్‌కు చేరుకున్నారు. వారికి కావాల్సిన ఇమ్మిగ్రేషన్ ఏర్పాట్లు కూడా చేశాం. వీరి సంరక్షణను ఏపీ భవన్ చూసుకుంటోందని అన్నారు మంత్రి లోకేష్.
నేపాల్ లో 217 మంది ఏపీ పర్యాటకులు చిక్కుకున్నారు: మంత్రి లోకేష్
వీరంతా 12 ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించాం
టైమ్ టు టైమ్ మానిటరింగ్ చేస్తున్నాము
ఖాట్మాండు నుంచి ప్రత్యేక విమానంలో వీరిని రాష్ట్రానికి తీసుకొస్తాం
– మంత్రి లోకేష్ pic.twitter.com/UzFwMJNzUO
— BIG TV Breaking News (@bigtvtelugu) September 10, 2025