TTD Pink Diamond: తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారంపై క్లారిటీ వచ్చిందా? వైసీపీ చేసిన ఆరోపణలు శుద్ధ అబద్దమని తేలిపోయిందా? ఇంతకీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? ఆనాడు ఆరోపణలు చేసిన టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు నెక్ట్స్ ఏం చేయబోతున్నారు? వైసీపీ సెల్ఫ్‌గోల్ వేసుకోనుందా? ఇవే ప్రశ్నలు శ్రీవారి భక్తులను వెంటాడుతున్నాయి.
తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించి చెప్పనక్కర్లేదు. 2019 ఎన్నికల ముందు దీనిపై రాజకీయ దుమారం రేగింది. పిండ్ డైమండ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో ఉందంటూ ఓ రేంజ్‌లో తప్పుడు విమర్శలు చేసింది. ఆనాడు ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఇదీ కూడా ఓ కారణం. ఆరేళ్లుగా నలిచిన ఈ వ్యవహారానికి చెక్ పడింది. ఆధారాలతో సహా బయటపెట్టింది.
మైసూరు మహారాజు తిరుమల శ్రీవారికి బహుమతిగా పింక్ డైమండ్ తేల్చింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. కేవలం కెంపు మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఏఎస్ఐ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టింది. మైసూర్‌లోని ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి వాటి వివరాలను వెల్లడించారు. తాము సేకరించిన ఆధారాల ప్రకారం శ్రీవారికి ఇచ్చింది పింక్ డైమండ్ కాదన్నారు.
80 ఏళ్ల కిందట అంటే 1945 జనవరి 9న మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. ఆయన చిన్నతనంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారని క్లారిటీ ఇచ్చారు. అటు మైసూరు ప్యాలెస్ రికార్డుల్లో కెంపులు, రకాల రత్నాలు గురించి ఉన్నాయని తెలిపారు. అందులో పింక్ డైమండ్ ప్రస్తావన లేదన్నారు.
ALSO READ: మావాళ్లు ఇంకా గేర్ మార్చలేదు, బాధపడుతున్న జగన్
అప్పట్లో ఢిల్లీలో రూ.8,500లకు దాన్ని తయారు చేయించారు. దీంతో గతంలో ఆనాటి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, వైసీపీ నేతలు చేసిన విమర్శలు అవాస్తవమని తేలిపోయింది. ఇప్పుడు రమణ దీక్షితులు, వైసీపీ పెద్దలు ఏం చెబుతారు? మావల్లే పింక్ డైమండ్ గుట్టు వీడిందని సరిపెట్టుకుంటురా? చేసిన తప్పుడు ప్రచారానికి తప్పయ్యిందని స్వామిని వేడుకుంటారా?
శ్రీవారిని రాజకీయాల్లోకి లాగడ సరైనదేనా? ఈ లెక్కన వైసీపీ రాజకీయాలు ఈ విధంగా ఉంటాయని పింక్ డైమండ్ ద్వారా ప్రజలకు అర్థమైందని అంటున్నారు టీడీపీ నేతలు. ఈ లెక్కన రానున్న ఎన్నికల్లో వైసీపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటి? అన్నవరం లేక సింహాచలం దేవస్థానమా? అంటూ ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
మరోసారి తెరపైకి తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారం
తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు సమర్పించినది పింక్ డైమండ్ కాదని, అది కేవలం కెంపు రాయి మాత్రమేనని తెలిపిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా
ఆ హారంలో రూబీలు, కొన్ని రత్నాలు మాత్రమే ఉన్నాయని సమాచారం
పింక్ డైమండ్ ప్రచారం… pic.twitter.com/T8S6x3yr0O
— BIG TV Breaking News (@bigtvtelugu) September 11, 2025