BigTV English

AP Govt: నిన్న ఆంజనేయులు.. నేడు సునీల్‌కుమార్, ఆరు తప్పులివే?

AP Govt: నిన్న ఆంజనేయులు.. నేడు సునీల్‌కుమార్,  ఆరు తప్పులివే?

AP Govt: వివాదాస్పద, వైసీపీ హయంలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన అధికారులపై దృష్టి పెట్టింది కూటమి సర్కార్. ఇప్పటికే ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు కటకటాలు పాలయ్యారు. తాజాగా ఇప్పుడు మరో ఐపీఎస్ వంతైంది. ఆయనెవరో కాదు.. సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్. ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో రేపటి రోజున ఇంకా ఏ ఐపీఎస్ ఉంటారోనన్న టెన్షన్ చాలామందిలో అప్పుడే మొదలైంది.


ప్రస్తుతం సస్పెండ్‌లో సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్‌పై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్‌ను నమోదు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. సర్వీసు నిబంధనల ఉల్లంఘనతోపాటు ఆయనపై రకరకాల అభియోగాల మేరకు ‘ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్’ నమోదు చేసింది.

వైసీపీ హయాంలో ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఆయన విదేశాలకు వెళ్లేవారు. కొన్ని సందర్భాల్లో ఒక దేశానికి వెళ్లేందుకు అనుమతి పొంది మరో దేశంలో పర్యటించేవారు. అఖిల భారత సర్వీసు రూల్స్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా రూల్స్‌ను ఉల్లంఘించి, క్రమశిక్షణ రాహిత్యానికి, దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట పీవీ సునీల్‌కుమార్‌ను సస్పెండ్‌ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.


ఇప్పుడు ఆయనపై అభియోగాలు మోపింది. అభియోగాలపై వ్యక్తిగతంగా హాజరుకావాలని లేదంటే లిఖిత పూర్వకంగా నెల రోజుల్లో సమాధానం ఇలివ్వాలని ఆదేశించింది. గడువులోగా రిప్లై ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.

ALSO READ: మార్కుల వేట, గవర్నమెంటు స్కూలా? మజాకా?

మరో పాయింట్ కూడా మెన్షన్ చేసింది. విచారణను ప్రభావితం చేసేలా వ్యవహరించినా, ఎవరితోనైనా సిఫారసు చేయించినా తీవ్ర చర్యలు తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఉత్తర్వులిచ్చారు.

1. ఐపీఎస్ వీపీ సునీల్‌కుమార్‌ అగ్నిమాపక శాఖ డీజీగా పని చేశారు. ఆ సమయంలో 2024 మార్చి ఒకటి నుంచి నాలుగు వరకు జార్జియా వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారు. అయితే ఆయన విరుద్ధంగా దుబాయ్ కి వెళ్లారు.

2. సెకండ్ పాయింట్‌కి వద్దాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా పలుమార్లు ఫారెన్ టూర్ కి వెళ్లారు. రెండేళ్ల కిందట అంటే 2023 సెప్టెంబరు 2 నుంచి 11 వరకు స్వీడన్‌కు వెళ్లారు.

3. ఐపీఎస్ సునీల్‌కుమార్‌ కొన్నాళ్లపాటు పోస్టింగ్‌ లేకుండా సాధారణ పరిపాలన శాఖలో ఉన్నారు. ఆ సమయంలో 2023 ఫిబ్రవరి ఒకటి నుంచి 28 వరకు అమెరికాలో పర్యటించారు. దీనికి ఆయన ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదు.

4. సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడు 2022 డిసెంబరు 14 నుంచి 19 వరకు జార్జియాలో పర్యటించేందుకు అనుమతి పొందారు సునీల్ కుమార్. అయితే చివరి నిమిషంలో దుబాయ్‌కి‌ వెళ్లారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదు.

5. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా వైసీపీ హయాంలో ఫారెన్ వెళ్లారు ఈ ఐపీఎస్. 2021 అక్టోబరు 2 నుంచి 8 మధ్యకాలంలో ఆయన దుబాయ్‌లో విహరించారు.

6. జగన్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో అమెరికా వెళ్లేందుకు అనుమతి పొందారు ఆయన. 2019 డిసెంబరు 21 నుంచి 2020 జనవరి 4 మధ్య లండన్‌ లో పర్యటించారు.

ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో ఆయన పబ్లిక్ సమావేశాలు పెడుతున్నారు. దానిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో పీవీ సునీల్ కుమార్ నెక్ట్స్ ఎటువైపు అడుగులు వేయనున్నారు. అభియోగాలపై ప్రభుత్వానికి సమాధానం ఇస్తారా? లేకుంటే రాజీనామా చేస్తారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నారు.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×