BigTV English

AP Students: పది విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

AP Students: పది విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

AP Students: ఏపీలోని పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పది పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఇప్పటికే పది పరిక్షల షెడ్యూల్ విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా పది విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.


ఏపీ ప్రభుత్వం పది పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 17 నుండి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అది కూడా ప్రతి పరీక్షకు ఒకటి లేక రెండు రోజుల గడువు ఉండడం విశేషం. దీనివల్ల విద్యార్థుల్లో ఉన్న పరీక్షల భయం కొంతైనా తగ్గుతుందన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. పది పరీక్షల షెడ్యూల్ విడుదల సమయంలో మంత్రి నారా లోకేష్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి విద్యార్థి ఉత్తమ మార్కులు సాధించేందుకు ఈ సమయం ఉపయోగపడుతుందని లోకేష్ అభిప్రాయ పడ్డారు.

తాజాగా పది పరీక్షల ఫీజు విషయంలో కూడా మంచి నిర్ణయంను ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల ఫీజును చెల్లించలేని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని, ఫీజు గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ నెల 27 నుండి జనవరి 10వ తేదీ వరకు రూ. 1000 ఫైన్ తో ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది ప్రభుత్వం.


Also Read: AP Govt: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుక అదిరింది కదూ!

పలు కారణాలతో పరీక్ష ఫీజు చెల్లించలేని విద్యార్థులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. అలాగే పది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించేలా తర్ఫీదు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వం సూచించింది. విద్యలో వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించి, ఉత్తమ మార్కుల సాధనకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కోరింది. మరి పది విద్యార్థులూ.. ఫీజు గడువు పెంచారు. వెంటనే మీ హెచ్.యం లను సంప్రదించి ఫీజు ఆన్ లైన్ చెల్లించారో లేదో చూసుకోండి!

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×