BigTV English

Coffee Side Effects: కాఫీ తాగితే కిడ్నీలు పాడవుతాయా?

Coffee Side Effects: కాఫీ తాగితే కిడ్నీలు పాడవుతాయా?

కాఫీ పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. ఆ ఆలోచన వారిలో వెంటనే కాఫీ తాగేయాలని కోరికను పుట్టేస్తుంది. ఉదయం లేస్తే చాలు కాఫీతోనే రోజును మొదలుపెట్టేవారు ఎంతోమంది. ఉదయం సాయంత్రం రెండుసార్లు అయినా కాఫీ తాగితే కానీ పని ముందుకు వెళ్లదు. మరికొందరైతే భోజనం చేశాక కూడా కాఫీ తాగడం ప్రారంభిస్తారు. అయితే ఈ కాఫీ మన కిడ్నీలు, కాలేయంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోవడం కోసం పరిశోధనలు జరిగాయి.


కేవలం మనదేశంలోనే కాదు అమెరికాలో కూడా కాఫీ ప్రియులు ఎక్కువ. ప్రతిరోజూ పది మందిలో ఆరుగురు కాఫీని తాగుతూనే ఉంటారు. ఒక కప్పుతో ఆగరు… మూడు నాలుగు కప్పుల వరకు తాగేస్తూ ఉంటారు. రోజును ప్రారంభించడానికి బెస్ట్ ఎంపిక కాఫీనే అనుకుంటారు. కాఫీ తాగిన వెంటనే మనిషి చురుగ్గా మారుతాడు. మెదడు ఉత్సాహంగా పనిచేస్తుంది. ఏదో తెలియని శక్తి శరీరంలో చేరినట్టు అనిపిస్తుంది. అందుకే కాఫీకి ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. అలాగే కాఫీ కూడా మెదడును ఉత్తేజ పరచడంలో ముందుంటుంది. ఒక కప్పు కాఫీ తాగితే చాలు నిమిషాల్లో అలసట తగ్గిపోతుంది. కొత్త శక్తి అందుతుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను బంధించి ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.

కాఫీ తాగడం వల్ల శరీరకణాల నష్టం కూడా తగ్గుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల అకాల వృద్ధాప్యం వస్తుంది. దాన్ని అడ్డుకోవడంలో కాఫీ ముందుంటుంది. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారు రోజుకు ఒక కప్పు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే. కొంతమంది కాఫీ తాగితేనే బాత్రూంకి వెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంతలా కాఫీకి బానిసలుగా మారిపోయారు నేటి ప్రజలు.


కాలేయానికి మంచిదేనా?
కాఫీ కాలేయంపై, మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోవడం కోసం అధ్యయనాలు జరిగాయి. శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలేయం. ఇది రోజంతా బిజీగానే ఉంటుంది. అయిదువందల కంటే విభిన్నమైన పనులను ఇది నిర్వహిస్తుంది. మనం తిన్న ఆహారం నుండి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులను సేకరించి శక్తిగా మారుస్తుంది. మన శారీరక పనితీరుకు అవసరమైన ప్రోటీన్లు, రసాయనాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. పెద్ద పేగును క్లీన్ చేయడానికి కూడా కాలేయం అవసరం. కాఫీ తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని తేలింది. అలాగే శక్తిని అందిస్తుందని తెలిసింది. అయితే రోజుకు రెండు కప్పుల కన్నా ఎక్కువ కాఫీ తాగకపోవడమే మంచిది. అందులో ఉండే కెఫీన్ హాని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిమితంగా కాఫీను తాగితే కాలేయానికి అంతా మేలే జరుగుతుంది.

మూత్రపిండాల ఆరోగ్యం
కాలేయంలాగే మూత్రపిండాలు కూడా బిజీగా పని చేస్తూ ఉంటాయి. రక్తం నుండి మురికిని, అదనపు నీటిని ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తాయి. రక్తంలో ఉన్న నీరు, ఉప్పు, ఖనిజాలను ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడడానికి అవి ఆమ్లాలను తొలగిస్తాయి. అలాగే రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడతాయి. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడంలో కూడా మూత్రపిండాలా పాత్ర ఉంది. మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో మూత్రపిండాలది ప్రధాన పాత్ర అని చెప్పుకోవచ్చు. అయితే కాఫీ కాలేయంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మూత్రపిండాలపై కూడా అలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది.

కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించినట్టే మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా కాఫీ ప్రోత్సహిస్తుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు మూత్రపిండాలకు కూడా మేలు చేస్తాయి. అయితే కాలేయంతో పోలిస్తే మూత్రపిండాలపై కాఫీ చూపించే ప్రభావం కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఒక పరిశోధనలో కాఫీ, టీ, సోడా వంటి కెఫీన్ ఉండే పదార్థాలు మూత్రపిండాల పనితీరును బలహీన పరుస్తాయని తెలిసింది. కాఫీ వల్ల మూత్రపిండాలు దెబ్బ తినకుండా ఉండాలంటే మితంగా రోజుకి ఒక కప్పు కాఫీ లేదా రెండు కప్పులు కాఫీలు మాత్రమే తాగాలి. దీనివల్ల మూత్రపిండాలపై కెఫీన్ తాలూకు చెడు ప్రభావం పడకుండా అడ్డుకోవచ్చు.

Also Read:  దోసకాయ తిని చనిపోయిన బాలుడు.. అసలు ఏం జరిగింది? వైద్యులు ఏం చెప్పారు?

కొంతమంది రోజుకు మూడు కప్పులు, నాలుగు కప్పులు కాఫీని తాగేందుకు ప్రయత్నిస్తారు. కాఫీలో ఉండే కెఫీన్ జీవక్రియను నెమ్మదిగా చేస్తుంది. కెఫీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎక్కువ కప్పుల కాఫీ తాగితే రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మూత్రపిండాల పనితీరు కూడా బలహీనపడవచ్చు. కాబట్టి కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలు పొందాలనుకుంటే రోజుకు రెండు కప్పుల కాఫీతో ఆపేయడం మంచిది.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×