Free Electricity In AP: వినాయక చవితి, దసరా పండుగల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గణేశ్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ఏపీ ప్రభుత్వం కూడా ఉచిత విద్యుత్ ప్రకటించింది. మంత్రి లోకేష్ విజ్ఞప్తిని పరిశీలించిన సీఎం చంద్రబాబు, జీవో విడుదలకు ఆదేశించారు.
ఈ నిర్ణయం ద్వారా భక్తులు, పూజారులు పండుగల్లో విద్యుత్ ఖర్చు గురించి ఆలోచించకుండానే ఉత్సాహంగా పండుగ ఉత్సవాలను సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించవచ్చు. గత సంవత్సరాలలో వినాయక చవితి, దుర్గామాత పండుగల సమయంలో విద్యుత్ సరఫరా సమస్యలు ఏర్పడ్డాయి. అందుకే భక్తులుఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ కొత్త విధానం ద్వారా భక్తులు, పూజారులు ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా పండుగ ఉత్సవాలను మరింత ఉత్సాహంగా జరుపుకోవచ్చు.
Akso read:Khairatabad Ganesh: విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపతి.. ఈసారి ఎన్ని అడుగులంటే..
ఆనందంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు
తెలంగాణ ప్రభుత్వం వినాయక చవితి, దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గణేష్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కీలక నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా, అనుమతి పొందిన మండపాలకు 2025 ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు అంటే 11 రోజులపాటు గణేష్ నవరాత్రి ఉత్సవాలకు, అలాగే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు అంటే 15 రోజులు దుర్గా నవరాత్రి ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించనున్నారు.
ఈ నిర్ణయం నిర్వాహకుల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు, సురక్షితమైన, పర్యావరణ అనుకూల ఉత్సవాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంటుందని తెలంగాణ సర్కార్ ఈ ఉచిత విద్యుత్‌ను ప్రకటించింది. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వినాయక చవితి, దసరా సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
గణేష్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయం
మంత్రి లోకేష్ విజ్ఞప్తితో జీవో విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశం pic.twitter.com/Vsuv3CCXip
— BIG TV Breaking News (@bigtvtelugu) August 25, 2025