Bigg Boss Agnipariksha: బుల్లి తెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమానికి తెలుగులో ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. వివిధ భాషలలో ఈ కార్యక్రమం ప్రసారమవుతున్న నేపథ్యంలో తెలుగులో కూడా ఇప్పటికే 8 సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకొని తొమ్మిదవ సీజన్ లోకి అడుగు పెట్టబోతున్నారు. త్వరలోనే తొమ్మిదవ సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం బిగ్ బాస్ అగ్నిపరీక్ష(Bigg Boss Agnipariksha) అంటూ ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం జియో హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.
జడ్జిలుగా మాజీ కంటెస్టెంట్లు..
ఇక ఈ కార్యక్రమంలో కామన్ మ్యాన్ క్యాటగిరీలో భాగంగా ఎంపిక చేసిన వారికి ఇక్కడ టాస్కులను నిర్వహిస్తూ వారిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు జడ్జిలుగా వ్యవహరించబోతున్నారు. శ్రీముఖి ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించగా నవదీప్, బిందు మాధవి, అభిజిత్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం మూడు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఇలా ఈ అగ్ని పరీక్ష కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్లకు పెద్ద ఎత్తున టాస్కులను ఇస్తూ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
అగ్ని పరీక్ష లేదు.. బొక్క పరీక్ష లేదు
ఇలా అగ్ని పరీక్ష కార్యక్రమంలో సెలెక్ట్ అయిన వారు నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఈ అగ్ని పరీక్ష కార్యక్రమం గురించి అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అగ్ని పరీక్ష లేదు.. బొక్క పరీక్ష లేదు… జనాలు ఖాళీగా ఉన్నారు. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లకు డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు ఇంకా స్టార్ మా కు ఏం కావాలి. ఆ జడ్జెస్ కు షో కి 5000 ఇస్తే అక్కడ కూర్చుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫ్లోర్ ఖాళీగా ఉంటుంది అందుకే ఇలా అగ్ని పరీక్ష అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తప్ప ఆ షోలో ఏమీ లేదు అంటూ ప్రేక్షకులు అగ్నిపరీక్ష కార్యక్రమం పై వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
?igsh=MzlqeHNhdHVzeDkw
ఇలా అగ్నిపరీక్ష కార్యక్రమం గురించి నెటిజన్స్ స్పందిస్తూ ఇది నిజమేనని ఈ కార్యక్రమం వల్ల పెద్దగా ప్రయోజనం కూడా ఏమీ లేదు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఇక తెలుగులో మొదటి నుంచి కూడా బిగ్ బాస్ కార్యక్రమానికి ఓవర్గం నుంచి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం గురించి కొంతమంది కోర్టుకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారమయ్యే ముందు ఈ కార్యక్రమం పై పలువురు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక తొమ్మిదవ సీజన్లో భాగంగా సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉండబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈసారి డబుల్ హౌస్, డబుల్ డోస్ అంటూ కార్యక్రమం పై పెద్ద ఎత్తున అంచనాలను పెంచేశారు. ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి నాగార్జున (Nagarjuna)హోస్టుగా వ్యవహరిస్తున్నారు.
Also Read: Sivakarthikeyan: మురగదాస్ తో సినిమా అంటే హేళన చేశారు.. ఎమోషనల్ అయిన హీరో!