E-Paper
Advertisement

AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు
Advertisement

AP Heavy Rains: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీవ్ర అల్పపీడనం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తరువాత 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

శని, ఆదివారాల్లో భారీ వర్షాలు

రేపు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 35-55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మలక్కా జలసంధి, ఇండోనేషియాను ఆనుకుని ఉన్న “సెన్యార్” తుపాను తీరం దాటిందని తెలిపింది.

Advertisement

Also Read: Vaikunta Dwara Darshanam: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. రేపట్నుంచి ఎలక్ట్రానిక్ డిప్ నమోదు.. సర్వదర్శనం టోకెన్లూ ఆన్ లైన్ లో 

వాతావరణ మార్పుల దృష్ట్యా శనివారం నుంచి మంగళవారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో పలు చోట్ల ఈశాన్య గాలులు బలంగా వీస్తాయని వాతావరణ అధికారులు స్పష్టం చేశారు.

ఏపీకి తప్పిన తుపాను ముప్పు

Advertisement

సెన్యార్ తుపాన్ ఇండోనేషియాను తాకింది. అక్కడ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఏపీపై తుపాను ప్రభావం లేకపోయినా.. తమిళనాడు తీరంలోని చెన్నై, కడలూరు, నాగపట్టినం జిల్లాలతో పాటు కేరళలోని కొన్ని జిల్లాల్లో గంటల తరబడి భారీ వర్షం కురిసింది. అండమాన్ & నికోబార్ దీవుల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో రెస్క్యూ ఆపరేషన్లు, రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మరింత రెండు రోజుల పాటు ఈ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు ఈ వారం సముద్రంలోకి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×