Big Stories

AP High Court: పింఛన్ల పంపిణీ.. ఆ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు..

AP High Court
AP High Court

AP High Court: ఏపీలో పింఛన్ల పంపిణీపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశాలిచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం వారిని ఆ బాధ్యతలను తప్పించింది. పింఛన్ల పంపిణీ ప్రక్రియను సచివాలయాల ఉద్యోగులకు అప్పగించింది. ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన వరలక్ష్మి, మరో ఇద్దరు పింఛన్ లబ్ధిదారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఈసీ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ ఇచ్చేవారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వివరించారు.

- Advertisement -

Also Read: పింఛన్ల పంపిణీలో గందరగోళం.. లబ్ధిదారులకు కష్టాలు..

ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. వాలంటీర్లు లేని రాష్ట్రాల్లోనూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా? అని ప్రశ్నించింది. పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారని హైకోర్టుకు తెలిపారు. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారని అందుకే ఈ పిటిషన్ కొట్టివేస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News