BigTV English

AP High Court Notices To Jagan : రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ.. జగన్‌కు హైకోర్టు నోటీసులు..

AP High Court Notices To Jagan : రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ.. జగన్‌కు హైకోర్టు నోటీసులు..
ap political news

AP High Court Notices To Jagan(AP political news):

ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందంటూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎం వైఎస్ జగన్‌ సహా కొంతమంది మంత్రులు, అధికారులకు నోటీసులు ఇచ్చింది. మొత్తం 41 మందికి నోటీసులు పంపింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.


ఏపీలో అమలు చేస్తున్న పథకాల మాటున ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ లో ప్రజా ప్రయోజనాలేవి లేవని స్పష్టంచేశారు. కేవలం వ్యక్తిగత దురద్దేశాలతో పిటిషన్‌ వేశారని ఉన్నత న్యాయస్థానానికి వివరించారు. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్నారు.

మరోవైపు పిటిషనర్ రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది తమ వాదన వినిపించారు. ఈ పిటిషన్ హైకోర్టులో వేయగానే.. ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని ఆరోపించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం 41 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.


Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×