E-Paper
Advertisement

CSK – MI Fans: ఒరేయ్ మీకు ఒక్కటే… మాకు 5+5 మొత్తం 10.. RCB పరువు తీశారుగా

CSK – MI Fans: ఒరేయ్ మీకు ఒక్కటే… మాకు 5+5 మొత్తం 10.. RCB పరువు తీశారుగా
Advertisement

CSK – MI Fans : ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఆర్సీబీ ఎప్పుడైతే టైటిల్ సాధించిందో అప్పటి నుంచి ఆర్సీబీ పై ఓ వైపు చెన్నై సూపర్ కింగ్స్.. మరోవైపు ముంబై ఇండియన్స్ అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. వాస్తవానికి పంజాబ్ కింగ్స్ పై ఫైనల్ లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ వాళ్లు ట్రోలింగ్స్ చేయాలి కానీ.. ముంబై, చెన్నై వాళ్లు ఎందుకు చేస్తున్నారని కొందరూ క్రీడాభిమానులు పేర్కొంటున్నారు. వాస్తవానికి విరాట్ కోహ్లీ కి ఉన్నక్రేజ్ వేరు. అయితే ఎం.ఎస్. ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు పోటా పోటీ ఉంటుంది. అందుకే ఆర్సీబీ పై చెన్నై, ముంబై ఇండియన్స్ అభిమానులు ట్రోలింగ్స్ చేస్తారు.

Also Read : Rinku Singh Engagement: ఎంపీతోనే రింకూ సింగ్ ఎంగేజ్మెంట్.. కట్నం ఎంతంటే ?

Advertisement

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు, ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ట్రోఫీ గెలుచుకుంది. ఇక ముంబై ఇండియన్స్ కూడా 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్ సాధించాయి. దీంతో ఆర్సీబీ పరువు తీశారు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అభిమానులు. ముఖ్యంగా ఒరేయ్ మీకు ఒక్క టైటిల్ వస్తేనే ఆగడం లేదు.. మాకు 5+5 మొత్తం 10 టైటిల్స్ వచ్చాయి. కాస్త అణిగి మణిగి ఉండండిరా బాబు అని ఆర్సీబీ పై అభిమానులు ట్రోలింగ్స్ చేస్తున్నారు. మరోవైపు ఎం.ఎస్. ధోనీ, రోహిత్ శర్మ లకు సంబంధించిన భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. ఆ ఫ్లెక్సీలో ఉన్న రోహిత్ శర్మ, ధోనీ ఫోటోలకు బొట్టు పెట్టి దండలు వేసి అరచేతిలో దీపం ముట్టించుకొని దేవుళ్లకు తిప్పినట్టు తిప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ రెండు జట్ల అభిమానులు డ్యాన్స్ లు వేస్తూ సందడి చేస్తున్నారు.

ఐపీఎల్ ప్రారంభమైన 18 సంవత్సరాల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ సాధించింది. అయితే మీరు ఎన్ని టైటిల్స్ సాధించినా.. మేము ఒక్క టైటిల్ సాధిస్తేనే ఆ క్రేజే వేరు అన్నట్టుగా అభిమానులు పేర్కొంటున్నారు.  ఎంత క్రేజీ ఉన్నప్పటికీ ఆర్సీబీ వల్ల మరే జట్టు కూడా ఘనంగా సంబురాలు జరుపుకోకుండా అయింది. బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టు సంబురాలు జరుపుకుంటే.. ఆ సంబురాల్లో జరిగిన తొక్కిసలాట కారణంగా 11 మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమనే చెప్పాలి. ఇప్పటివరకు 18 సీజన్లలో ఏ ఒక్క సీజన్ లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ ఒక్కసారి టైటిల్ గెలవగానే అభిమానులు అలా చేయడం ఏంటి..? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా తమకు నచ్చిన క్రికెటర్ల పై అభిమానం ఉండాలి కానీ మరీ కొంత మందికి చావుకి కారణమయ్యేంత ఉండకూడదు అని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ లండన్ కి వెళ్లారు. దీంతో విరాట్ కోహ్లీ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్సీబీ జట్టుకి 18 సంవత్సరాల నుంచి విరాట్ కోహ్లీ ఆడుతున్నారు. 18వ సీజన్ లో టైటిల్ సాధించింది ఆర్సీబీ.  విరాట్ కోహ్లీ కారణంగా తొక్కిసలాట జరిగిందని కోహ్లీ పై కేసు కూడా నమోదు  కావడం గమనార్హం. 

Tags

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×