Thalliki Vandanam Update: ఏపీలో రేపో మాపో ప్రవేశ పెట్టనున్న తల్లికి వందనం స్కీమ్ విషయంలో ఏం జరుగుతోంది? ఈ పథకం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? కావాలంటే ప్రత్యర్థులు ఆ విధంగా ప్రచారం చేస్తున్నారా? ఈ స్కీమ్ మరో రెండురోజు వెనక్కి వెళ్తున్నట్లు ఎందుకు ప్రచారం జరుగుతోంది? నిధుల సమస్య వెంటాడుతోందా? రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
తల్లికి వందనం పథకం ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. అందుకు సంబంధించి డేట్ సైతం ఇచ్చేశారు. తొలుత జూన్ 12న ఏపీలో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఈ పథకం ప్రారంభించాలని భావించింది ప్రభుత్వం. పిల్లల తల్లులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాకపోతే ఆ రోజు పథకం మొదలుకాకపోవచ్చని ప్రభుత్వ వర్గాల ఓ వార్త బయటకు వచ్చింది.
విషయం ఏంటంటే తల్లికి వందనం స్కీమ్‌ని జూన్ 14న మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ వార్త హంగామా చేస్తోంది. అందులో నిజమెంతో తెలీదుగానీ, చంద్రబాబు సర్కార్‌పై ప్రత్యర్థులు దుమ్మెత్తి పోవడం మొదలుపెట్టారు. మాట తప్పడం చంద్రబాబు సర్కార్‌కు అలవాటేనని విమర్శలు మొదలుపెట్టారు. ఈ ప్రచారం వెనుక అసలేం జరుగుతోంది?
రెండురోజు కిందట సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశం జరిగింది. దాని తర్వాత మంత్రులతో చిన్నపాటి సమావేశం జరిగింది. అదే సమయంలో తల్లికి వందంన స్కీమ్ గురించి ప్రస్తావన వచ్చిందట. ఇందుకు కారణాలు చెప్పారట అధికారులు. జూన్ 12న నాటికి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుందని, ర్యాలీ సంబరాలు ఉంటాయని అంటున్నారు.
ALSO READ: విశాఖ చేపలకు ఏమైంది? ఆ పరిశోధనలో విస్తుపోయే నిజాలు
అదే రోజు తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ అవ్వాలంటే కష్టమని అధికారులు చెప్పడంతో మరో రెండు రోజులు సమయం ఇచ్చినట్టు సమాచారం. దీనికితోడు నిధులు కాస్త కొరత ఉందనే విషయాన్ని అధికారులు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకొచ్చారట. దీనిపై ముఖ్యమంత్రి ఆరా తీయడం జరిగిపోయిందని అంటున్నారు.
మొత్తానికి జూన్ 12న బదులు 14న పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేస్తోందట ప్రభుత్వం. ఇంతకీ జూన్ 14న తల్లుల ఖాతాలో డబ్బులు పడతాయా? మళ్లీ వాయిదా పడుతుందా? అంటూ ప్రత్యర్థుల నుంచి విమర్శలు మొదలయ్యాయి.
జూన్ 15న ఆదివారం ఆ రోజు బ్యాంకులు ఉండవు కావున 14లోపు తల్లుల అకౌంట్లలో డబ్బు జమ చేయాలని భావిస్తోందట ప్రభుత్వం. జూన్ 16 వరకు అయితే పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తాయని, వీలైనంత తొందరగా ఈ పని జరగాలని చెప్పారట సీఎం చంద్రబాబు. ఇప్పటికే పిల్లల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. దాని ప్రకారం నిధులు జమ చేయనున్నట్లు సమాచారం.