AP Inter Exams 2025: ఏపీలో నేటి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 3 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 20 వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఈ పరీక్షలకు నిమిషం నిబంధనను అమలు చేస్తున్నారు. అంటే పరీక్షలకు హాజరయ్యే వారు ఒక్క నిమిషం లేట్ అయిన అనుమతించరు. కాబట్టి విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకునేలా ప్లాన్ చేసుకుంటే మంచిది.
కాగా ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి 20 ఎగ్జామ్ సెంటర్లకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే ఎగ్జామ్ సెంటర్ల వద్దకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు అమర్చారు. దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని సమయానికి ఆర్టీసీ బస్సులు తిరిగే విధంగా ఆర్టీసీ ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5లక్షల 963 మంది జనరల్ విద్యార్థులు.. 44వేల 581 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4లక్షల 71వేల 21 మంది జనరల్ విద్యార్థులు హాజరుకానున్నారు.
సీసీ కెమరాల ఏర్పాటు..
ఎక్జామ్స్ సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయి. ఎలాంటి తప్పులు జరగకుండా సీసీ కెమరాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద, పరీక్ష జరిగే రూమ్‌ల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్స్, వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులేవి అనుమతించమని అన్నారు. ఎక్జామ్ సెంటర్ల సూపరింటెండ్లకు బోర్డు నుంచి ప్రత్యేక ఫోన్ సిమ్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రశ్నా పత్రాలు ట్యాంపరింగ్, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు క్యూ ఆర్ కోడ్, వాటర్ మార్కులో కోడ్ నెంబర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
పేపర్ లీక్ అయింది అంటూ.. వందతులు వ్యాపించజేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు అధికారులు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులు, ఇంటర్ నెట్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద మంచినీరు అదే విధంగా విద్యుత్ అంతరాయానికి తోవ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అలాగే ప్రథమ చికిత్స కోసం వైద్య శిబిరం, 108 అంబులెన్సులు, క్లాస్ రూమ్‌లలో సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.