Tamannaah:టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా (Tamannaah Bhatia).. చివరిగా ‘సికిందర్ కా ముఖద్దర్’ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న ‘ఓదెలా 2’ అనే సినిమాలో కూడా కనిపించబోతోంది. దీనికి తోడు ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేయగా.. ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్ పతాకాలపై డి.మధు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతోంది. ఇలాంటి సమయంలో మిల్క్ బ్యూటీకి పుదుచ్చేరి పోలీసులు నోటీసులు అందించారంటూ వచ్చిన వార్తలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ స్కాం లో తమన్నా పాత్ర ఉందంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ కథనాలపై తమన్న స్పందిస్తూ సమాధానం తెలిపింది.
క్రిప్టో కరెన్సీ స్కామ్ కథనాలపై తమన్నా రియాక్షన్..
క్రిప్టో కరెన్సీ స్కాం కథనాలపై తమన్నా మాట్లాడుతూ.. “రూ.2.4 కోట్ల క్రిప్టో కరెన్సీ స్కామ్ లో నా ప్రమేయం ఉందంటూ వార్తలు రావడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి నకిలీ, తప్పుదోవ పట్టించే వదంతులు ప్రచారం చేయవద్దు అని మీడియాలోని నా స్నేహితులను కూడా అభ్యర్థించాలని అనుకుంటున్నాను. అలా చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవడానికి నా టీం కూడా పనిచేస్తుంది. ఇలాంటి స్కాం తో నాకు సంబంధం లేదు. నాకు ఎలాంటి మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం లేదు. నాపై వస్తున్న వార్తలను తట్టుకోలేకపోతున్నాను. నిజా నిజాలు తెలియకుండా ఇలాంటి కథనాలు ఎలా ప్రచారం చేస్తారు. ఇంకోసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను” అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది తమన్నా. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
కోయంబత్తూర్ ప్రధాన కేంద్రంగా 2022లో క్రిప్టో కరెన్సీ పేరుతో ఒక కంపెనీని ప్రారంభించారు. ఈ ప్రారంభానికి తమన్నాతో పాటు పలువురు సెలబ్రిటీలకు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత మహాబలిపురంలోనే ఒక స్టార్ హోటల్లో జరిగిన ఈ సంస్థ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్(Kajal Agarwal) కూడా హాజరైంది. ఆ తర్వాత ముంబైలోని క్రూయిజ్ నౌకలో గ్రాండ్ గా పార్టీ నిర్వహించి, పెట్టుబడి పెట్టేలాగా ప్రజలను ఆకర్షించారు. లాభాలు అత్యధికంగా వస్తాయని చెప్పిన క్రిప్టో కరెన్సీ సంస్థ పుదుచ్చేరిలో వేలాదిమంది నుంచి రూ.2.4 కోట్లు వసూలు చేశారు. ఇక ఈ కేసులో అరవింద్ కుమార్, నితీష్ జైన్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇకపోతే అశోకన్ అనే గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు హీరోయిన్ తమన్నా, కాజల్ అగర్వాల్ ని కూడా ఈ కేసులో భాగంగా పోలీసులు విచారించనున్నట్లు వార్తలు రావడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు హీరోయిన్స్ ప్రమేయం ఉందంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్న కారణంగానే.. తమన్నా రియాక్షన్ అవుతూ వార్నింగ్ కూడా ఇవ్వడం గమనార్హం. ఇక ప్రస్తుతం తమన్నా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Amitabh Bachchan: సినిమాలకు బిగ్ బి గుడ్ బై.. క్లారిటీ ఇచ్చిన హీరో..!