Hero Darshan:ప్రముఖ శాండిల్ వుడ్ హీరో దర్శన్(Darshan)తన సినిమాల కంటే, అభిమాని హత్య కేసులో భారీగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అభిమాని రేణుకా స్వామి(Renuka Swamy) ని హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా తన అభిమానిని కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ తూగదీప, అతడి అనుచరులు దాడి చేసి హత్య చేయడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు చాలామంది దర్శన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో తాజాగా దర్శన్ కి కర్ణాటక హైకోర్టు ఊరట కల్పించింది. దర్శన్ దేశవ్యాప్తంగా ప్రయాణించడానికి అనుమతులు కల్పిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసుని ఏప్రిల్ 8 కి వాయిదా వేయడం గమనార్హం.
Tamannaah: క్రిప్టో కరెన్సీ వార్తలపై తమన్నా రియాక్షన్.. ఏమన్నారంటే..?
కర్ణాటక హైకోర్టులో దర్శన్ కు భారీ ఊరట..
వాస్తవానికి దర్శన్ బెంగళూరు నుంచి బయటకు వెళ్లడానికి సెషన్ కోర్టు అనుమతించలేదు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును పరిశీలిస్తున్న నేపథ్యంలో తన క్లైంట్ ఢిల్లీ తో పాటూ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని దర్శన్ తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించుకున్నారు. పలు ఆరోగ్య కారణాలు చూపెడుతూ.. దర్శన్ కు బెయిల్ కూడా కోరాడని, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రయాణించాలని అనుకుంటున్నట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ హైకోర్టు మాత్రం అనుమతులు జారీ చేసింది. ఇక దీంతో హీరోకి భారీ ఊరట కలిగిందని చెప్పవచ్చు. ఇకపోతే రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ తో పాటు ఆయన భాగస్వామి పవిత్ర గౌడ అలాగే మరో 15 మంది నిందితులు ఫిబ్రవరి 25న బెంగళూరు స్థానిక కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో ఇతర నిందితులు తమను అప్రూవర్లుగా మారమని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని పేర్కొనడం గమనార్హం.
ప్రేయసి కోసం అభిమానిని హత్య చేసిన హీరో దర్శన్..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. హీరో దర్శన్ పెళ్లయ్యి పిల్లలు ఉన్నా కూడా.. సీరియల్ నటి పవిత్ర గౌడ (Pavitra Gowda ) తో రిలేషన్ లో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని గత కొన్ని నెలల క్రితం పవిత్ర గౌడ తమ బంధానికి పదేళ్లు అంటూ దర్శన్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దీనితో సహించలేకపోయిన దర్శన్ వీరాభిమాని రేణుకా స్వామి (Renuka Swamy), పవిత్ర గౌడను దూషిస్తూ సోషల్ మీడియా ద్వారా పలు కామెంట్లు చేశారు. ముఖ్యంగా తమ అభిమాన హీరో వైవాహిక జీవితంలో నిప్పులు పోశావని, దయచేసి అతడిని వదిలి వెళ్ళిపోమని, తమ వదినకు అన్యాయం చేయవద్దని రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు. ఎంతకూ వినకపోవడంతో అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. దీంతో విసిగిపోయిన పవిత్ర గౌడ.. దర్శన్ తో పాటు మరో 15మంది అనుచరులతో రేణుకా స్వామి పై దాడి చేసి అతడిని అత్యంత కిరాతకంగా చంపించారు. ఈ హత్య ఆరోపణలపై దర్శన్ పవిత్ర తో పాటు మరో 15 మందిని జూన్ 11 2024న అరెస్టు చేశారు. దర్శన్ 131 రోజులు కస్టడీలో గడిపిన తర్వాత అక్టోబర్ 30 2024న జైలు నుండి బెయిల్ మీద విడుదలయ్యారు. ఇక అభిమాని హత్య కేసులో దర్శన్ మాత్రం భారీగా పాపులారిటీ సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. అంతేకాదు ఇప్పటికీ పలువురు అభిమానులు ఈయనపై విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం.