BigTV English

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

AP Liquor Case: వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్‌లో మాజీ సీఎం జగన్ పాత్ర ఉందని అనుబంధ ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది సిట్. సేకరించిన ముడుపులను బిగ్‌బాస్‌కు చేరవేయడంలో ముగ్గురు వ్యక్తులు కీలకపాత్ర పోషించినట్టు ప్రస్తావించింది. త్వరలో వేయబోయే ఛార్జిషీటులో ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది.


లిక్కర్ కేసులో ఏసీబీ రెండో ఛార్జిసీటు దాఖలు చేసింది. తొలి అభియోగపత్రంలో రూ.3500 చేతులు మారినట్టు పేర్కొంది. సేకరించిన ముడుపులు వ్యక్తులకు చేరవేయడంలో ముగ్గురు వ్యక్తులు కీలకపాత్ర పోషించినట్టు పేర్కొంది. సేకరించిన ముడుపులు ఎన్నికలకు 300 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం, భారతీ సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ బాలాజీ గోవిందప్ప దుబాయ్‌కి ఎలా పంపించారు?

ఆయన పాత్ర ఏంటి? హవాలా మార్గంలో నడిపించడంలో ఆయన పాత్ర ఏంటి? అనేది ఛార్జిషీటులో పేర్కొన్నారు. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి పాత్రపైనా అందులో కీలక విషయాలను తెలిపింది. సేకరించిన ముడుపులను బిగ్‌బాస్‌కు చేర్చడంలో ఈ ముగ్గురి పాత్ర కీలకంగా మారింది. ఈ లెక్కన్ థర్డ్ ఛార్జిషీటులో సిట్ ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది.


సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్‌ అధికారులు లిక్కర్ కేసుకు సంబంధించి మరో ఛార్జిషీటు దాఖలు చేశారు.  124 పేజీలు, 16కు పైగా వాల్యూమ్‌లు ఆ ఛార్జిషీటులో ఉన్నాయి. గతంలో వేసిన ఛార్జిషీటులో ఏడుగురు వ్యక్తులు, 9 సంస్థలపై అభియోగాలు మోపారు. తాజాగా కొత్తగా ముగ్గురు నిందితులపై అభియోగాలు మోపింది సిట్.

ALSO READ: పులివెందుల జెడ్పీ ఉప ఎన్నిక పోలింగ్ మొదలు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్ 

ఇప్పుడు ఛార్జిషీటులో హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీలు, నకిలీ డైరెక్టర్ల వివరాలను పొందుపరిచింది. అంతేకాదు కుంభకోణంలో కీలక పాత్ర పోసించిన వైసీపీ ప్రభుత్వ సలహాదారు మాజీ ఐఏఎస్ అజేయ కల్లం పేరు ప్రస్తావించింది. ఎందుకంటే ఏ2-వాసుదేవరెడ్డి, ఏ3-సత్యప్రసాద్‌ల నియామకానికి సిఫార్సు చేసింది అజేయకల్లం అని చార్జిషీట్‌‌లో‌ వివరించింది.

మరోవైపు బేవరేజస్‌ కార్పొరేషన్‌లో అక్రమాలపై ఆనాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్ సిట్ విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించినా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆనాటి సీఎంవో అధికారులు ధనుంజయరెడ్డి-ఏ31, కృష్ణమోహన్‌రెడ్డి-ఏ 32 ఒత్తిడి చేసినట్లు తెలిపారు. ఆ విషయాన్ని ఛార్జిషీటు పేర్కొంది సిట్.

ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్‌కు మెమోలు జారీ చేసినా స్పందించలేదని తెలిపింది. ఈ విషయాన్ని ఆనాటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డికి తెలియజేసినట్లు రజిత్‌ భార్గవ తెలిపారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లను వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇమ్మని కోరినా ఎలాంటి స్పందన లేదన్నారు. వారు చేసిన పనులను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు సిట్ ప్రస్తావించింది.

లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి సీనియర్ ఐపీఎస్ PSR ఆంజనేయులు పేరు వచ్చింది. అడిషనల్ ఛార్జ్‌షీట్‌లో ఆయన గురించి కీలక విషయాలు ప్రస్తావించింది సెట్. ఈ కేసులోని నిందితులకు PSR ఆంజనేయులు నుంచి 60 కాల్స్ వెళ్లినట్టు పేర్కొంది. మిగతా నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణ‌మోహన్ రెడ్డి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. బాలాజీ గోవిందప్ప బాన్సువాడతో పాటు మూడు చోట్ల స్థిరాస్తులు, కుటుంబ సభ్యుల పేరు మీద కొనుగోలు చేసినట్లు పేర్కొంది.

Related News

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Big Stories

×