BigTV English

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో న్యూ ట్విస్ట్.. ఫామ్ హౌస్‌ని రౌండప్ చేసిన అధికారులు, రూ.11 కోట్లు సీజ్

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో న్యూ ట్విస్ట్.. ఫామ్ హౌస్‌ని రౌండప్ చేసిన అధికారులు, రూ.11 కోట్లు సీజ్

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో ఏం జరుగుతోంది? కుంభకోణంలో కూడబెట్టిన ముడుపుల సొమ్ములు, బంగారం హైదరాబాద్‌లో దాచి పెట్టారా? తొమ్మిది డెన్లలో ఏడు హైదరాబాద్‌లో ఉన్నాయా? వాటిలో ఒకటి బయట పడిందా? మిగతా ఆరు డెన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? అక్కడ ఏ స్థాయిలో డబ్బు నిల్వచేశారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


ఏపీ లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు. సిట్ అదుపులో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌‌లో ఓ ఫామ్‌హౌస్‌పై సిట్ అధికారులు సోదాలు చేశారు. అక్కడ నోట్ల కట్టలు చూసి అధికారులు షాకయ్యారు. ఒకటి రెండు కాదు ఏకంగా 11 కోట్ల రూపాయలను సీజ్ చేశారు.

వాటిని లెక్కించేందుకు అధికారులు యంత్రాలు తీసుకొచ్చారు. ఈ కేసులో A-1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి-వరుణ్ సమాచారం మేరకు ఆ మొత్తాన్ని సీజ్ చేసినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్‌ గెస్ట్‌‌హౌస్‌లో నగదు డంప్‌ను గుర్తించారు. లిక్కర్‌ కేసులో ఏ-40 వరుణ్‌ పురుషోత్తం ఉన్నారు.


ఇటీవల అదుపులోకి తీసుకున్న అధికారులు, అతడు ఇచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. నగదు వ్యవహారంలో చాణక్య-వినయ్‌ పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. గతేడాది అంటే 2024 జూన్‌లో ఆ డబ్బును దాచినట్లుగా తెలుస్తోంది. ఆ గెస్ట్‌హౌస్ సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ తగల బాల్‌రెడ్డి పేరు మీద ఉంది.

ALSO READ: ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఆ రోజే కొత్త రేషన్ కార్డుల పంపిణీ

లిక్కర్ కుంభకోణం వెలుగులోకి రాగానే ముడుపుల ద్వారా సేకరించిన నిధులు, బంగారం 9 డెన్లలో పెట్టినట్టు తెలుస్తోంది. అందులో దుబాయ్, తాడేపల్లిలో ఒకొక్కటి, హైదరాబాద్ 7 ఉన్నట్లు తేలింది. వాటిలో ఒకటి మాత్రమే హైదరాబాద్‌లో బయటకు వచ్చింది. మిగతా ఆరు డెన్లు ఎక్కడ ఉన్నాయి? అనేది తేలనుంది.

మిగతా డెన్లను గుర్తిస్తే ఇంకెన్ని నిధులు పట్టుబడతాయనేది ప్రస్తుత ప్రశ్న. రూ. 11 కోట్లు చిక్కన విషయం తెలియగానే ఆ పార్టీ కీలక నేతల్లో వణుకు మొదలైంది. ఏం చేయాలన్నా కీలక వ్యక్తులు అరెస్టు కావడంతో ముఖ్యనేతలు సైలెంట్ ఉండే పరిస్థితి ఏర్పడింది.

ఈ కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.18 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని శ్వేతపత్రంలో ప్రభుత్వ వెల్లడించిన విషయం తెల్సిందే. ఇప్పటివరకు రూ. 60 కోట్లను జప్తు చేసినట్టు ఛార్జిషీటులో సిట్ అధికారులు ప్రస్తావించారు. రానున్న రోజుల్లో మరింత డబ్బు, బంగారం పట్టుబడడం ఖాయమని అంటున్నారు.

 

 

Related News

AP Liquor Case: లిక్కర్ కేసు.. విమానంలో నేతలు-బ్యూటీలు, జల్సాల గుట్టు బయట పెట్టిన ఆనం

Pulivendula Tensions: బైపోల్ వేళ పులివెందులలో టెన్షన్.. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య దాడులు

AP Cabinet: చంద్రబాబు కేబినెట్ భేటీ, ఉచిత బస్సు, కొత్త బార్లపై ఫోకస్

Jagan On Ponnavolu: జగన్ సమక్షంలో ఏం జరిగింది? పొన్నవోలుపై రుసరుసలు

Handloom Sector: చేనేత రంగానికి ఏపీ బూస్ట్.. జీఎస్టీ భారం ప్రభుత్వానిదే

Super Six: సూపర్ సిక్స్ కి వైసీపీ ఉచిత ప్రచారం.. సాక్ష్యం ఇదే

Big Stories

×