BigTV English

AP Politics : ఆ ఓపిక తనకు లేదంటున్న అంబటి.. అయిపాయే..

AP Politics : ఆ ఓపిక తనకు లేదంటున్న అంబటి.. అయిపాయే..

AP Politics : లిక్కర్‌ కేసులో సిట్‌ దూకుడు పెంచింది. ఒకవైపు సిట్.. మరోవైపు ఈడీ రంగంలోకి దిగడంతో కేసు మరింత ఆసక్తిగా సాగుతోంది. ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశారు. త్వరలో జగన్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. స్కామ్‌లో కింగ్ పిన్ ఎవరనేది లోతుగా విచారణ చేస్తేనే తేలుతుందని సిట్ భావిస్తోంది. మాజీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్‌కి సైతం నోటీసులు ఇచ్చి విచారణ పిలిచే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం 20 రోజుల్లో మిథున్‌రెడ్డి బెయిల్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.


లిక్కర్ లెక్కలన్నీ..

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు సిట్ అధికారులు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి లిక్కర్ స్కాం చేసినట్టు తెలిపారు. కేసిరెడ్డి ఆఫీస్‌లో రెగ్యులర్‌గా సమావేశం నిర్వహించినట్లు గుర్తించారు. మిథున్ రెడ్డి, సాయిరెడ్డి, సత్యప్రసాద్, వాసుదేవరెడ్డిలు తరుచూ భేటీ అయ్యేవారని సిట్ తెలిపింది. లిక్కర్ నెట్‌వర్క్ ద్వారా వచ్చిన సొమ్మును కేసిరెడ్డితో కలిసి మేనేజ్ చేశారు. ఈ కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి కీలకంగా ఉన్నట్టు తేల్చారు. మరింత సమాచారం రాబట్టడానికి వారిద్దరిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది సిట్.


ఎన్ని అరెస్టులు చేస్తే అంతగా..

రిటైర్డ్ ఐఏఎస్‌ ధనుంజయరెడ్డి అరెస్ట్‌పై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. జగన్ చుట్టూ ఉన్న వారిని అరెస్ట్ చేస్తే.. ఏదో జరిగిపోతుందని భ్రమపడుతున్నారని అన్నారు. కేసులు పెట్టి వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని అన్నారు. కేసులకు బెదిరేది లేదన్నారు. వల్లభనేని వంశీ, గోరంట్ల మాధవ్‌ వంటి ప్రజలు ఎన్నుకున్న నేతలను కూడా అరెస్ట్ చేశారని చెప్పారు. ఎంత మందిని అరెస్ట్ చేస్తే.. తాము అంత రాటు తేలుతామన్నారు అంబటి.

ఫోన్ చేస్తే.. జైలుకు వచ్చేస్తా..

అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనను అర్థరాత్రి సమయంలో అరెస్ట్‌ చేయొద్దని.. రాత్రి సమయంలో వచ్చి ఇంటి డోర్లు కొట్టొద్దని కోరారు. అరెస్ట్‌ చేస్తున్నామని ఫోన్‌ చేస్తే చాలు.. బట్టలు సర్దుకుని జైలుకు వచ్చేస్తానని.. కుస్తీ పడే ఓపిక తనకు లేదన్నారు రాంబాబు. అంబటి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని వైసీపీ నేతల్లో చర్చ మొదలైంది. రెడ్‌బుక్‌లో ఉన్న నేతలంతా అరెస్టులకు సిద్ధమవుతున్నారని సమాచారం. పోలీసులు వచ్చి అరెస్ట్‌ చేసి తీసుకెళ్తే పరువు పోతుందని.. అందుకే ఫోన్‌ చేస్తే వచ్చేస్తానని అంబటి చెప్పాడాన్ని బట్టి.. తన అరెస్ట్ పై ఆయన మెంటల్‌గా ప్రిపేర్ అయ్యారని అంటున్నారు.

జగన్‌ను అరెస్ట్ చేసేందుకే..

మరోవైపు, ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో జగన్‌ను ఇరికించాలనే కుట్ర చేస్తున్నారన్నారు వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌. ఆయన్ను అరెస్ట్‌ అయినా చేయాలి, లేదంటే ఇబ్బందైనా పెట్టాలనే దురుద్దేశంతోనే.. జగన్ చుట్టూ ఉన్న వారిని అరెస్ట్‌ చేస్తున్నారని ఆరోపించారు.

10 గంటలు నిలబెట్టి..

అటు, ధనుంజయరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి. జగన్ హయాంలో సీఎంవోలో పనిచేసిన ఆయన.. తానే ముఖ్యమంత్రి అన్నట్టుగా షాడో సీఎంగా పెత్తనం చేసేవారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను గడ్డిపోచల్లా చూసేవారంటూ.. తనకు జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తంచేశారు. ఆనాటి సీఎంను కలవడానికి తాను వెళితే.. లోనికి రానీయకుండా 10 గంటల పాటు బయటే నిలుచోబెట్టారని మండిపడ్డారు కోటంరెడ్డి.

Also Read : వల్లభనేని వంశీకి సీరియస్..

రాచమల్లు సవాల్..

ఇక, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పేదలు తాగే మద్యం బ్రాండ్లు వైసీపీ ప్రభుత్వం కంటే.. కూటమి ప్రభుత్వంలో ఎక్కువ ధరకి అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. నాణ్యత కలిగిన మద్యం అమ్ముతాము అని చెప్పి.. వైసీపీ ప్రభుత్వంలో అమ్మిన బ్రాండ్లనే ఇప్పుడు అమ్ముతున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతి పల్లెలో బెల్టు షాపులు ఉన్నాయని అన్నారు. వైసీపీ హయాంలో ఒక్క పల్లెలో అయినా బెల్టు షాపు ఉందని నిరూపిస్తే.. రాజకీయాలలో పోటీ చేయనని సవాల్ విసిరారు రాచమల్లు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×