E-Paper
Advertisement

Tollywood: కుర్రహీరో మూవీ కోసం బడా నిర్మాతలు పోటీ.. ఆ క్రేజ్ ఏంటి సామీ!

Tollywood: కుర్రహీరో మూవీ కోసం బడా నిర్మాతలు పోటీ.. ఆ క్రేజ్ ఏంటి సామీ!
Advertisement

Tollywood:ఒకప్పుడు హీరోలు ఒకే ఏడాది 5 నుండి 6 చిత్రాలు రిలీజ్ చేసిన వారు ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఒక హీరో ఒక సినిమాను రిలీజ్ చేయడానికి కనీసం ఏడాదికి పైగా సమయం పడుతోంది. ఇక సుకుమార్ , రాజమౌళి లాంటి దిగ్గజాలతో సినిమాలు చేస్తే రెండు సంవత్సరాలకు పైమాటే.. అయితే ఇప్పుడు ఒక హీరో ఒకే ఏడాది అనే విషయం పక్కన పెడితే.. ఒకే నెలలో ఏకంగా రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయిపోయారు. ఆయన ఎవరో కాదు యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu). తాజాగా ఆయన నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ‘మృత్యుంజయ్’ సినిమా. ఫిబ్రవరి 27వ తేదీన విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఒకే నెలలో రెండు చిత్రాలతో శ్రీ విష్ణు..

అయితే మరోవైపు కామెడీ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’ కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం బడా నిర్మాతలు పోటీ పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సాధారణంగా ఒకే నెలలో అది కూడా తక్కువ వ్యవధిలో ఒకే హీరోకు సంబంధించిన రెండు సినిమాలు రావడం అనేది ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పెద్ద రిస్క్ గా మారిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.. దీనివల్ల ప్రేక్షకుల దృష్టి రెండు సినిమాలపై పడినా కన్ఫ్యూజన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఇప్పటికే ఈ సినిమాల ఓటీటీ ఒప్పందాలు కూడా పూర్తయ్యాయని.. అందుకే వీటిని వాయిదా వేయడం కష్టమని నిర్మాతలు కూడా చెబుతున్నారు. మరి ఇలాంటి సమయంలో శ్రీ విష్ణు ఆయన టీమ్ ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తారా? లేక ఒక సినిమాను మార్చి కి మారుస్తారా ? అన్న విషయం తెలియదు కానీ విష్ణు అభిమానులు మాత్రం ఏ సినిమాను ముందుగా చూడాలనే అయోమయంలో పడ్డారు.

Advertisement

also read:Pawan Kalyan: చెర్రీ – ఉప్సీ ట్విన్స్ కి పవన్ ఊహించని గిఫ్ట్.. ఏంటో తెలుసా?

శ్రీ విష్ణు మూవీ కోసం బడానిర్మాతలు పోటీ..

అయితే ఇదంతా కాస్త పక్కన పెడితే.. ఇప్పుడు శ్రీ విష్ణు సినిమా విష్ణు విన్యాసం కోసం బడా నిర్మాతలు పోటీ పడడం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకొని 7 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే అటు సితార వంశీ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు కర్ణాటక కలుపుకొని 8 కోట్ల డీల్ చేశారట. రాజేష్ దండా కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఏమి అంత స్పెషల్ ఉంది? ఎందుకు బడా నిర్మాతలు ఈ సినిమాకు ఈ రేంజ్ లో ఆఫర్ చేస్తున్నారు? అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది. మొత్తానికైతే అటు మృత్యుంజయ్ తో పాటు ఇటు విష్ణు విన్యాసం కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి.

ఇంత డిమాండ్ ఎందుకు?

Advertisement

నిజానికి శ్రీ విష్ణు కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. అవి కంటెంట్ పరంగానే కాదు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు కావడం గమనార్హం. శ్రీ విష్ణు సినిమాలు వస్తే మినిమం గ్యారెంటీ అనే టాక్ కూడా నడుస్తున్న నేపథ్యంలోనే ఇటు నిర్మాతలు ఈ సినిమా కోసం ఈ రేంజ్ లో ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ఎవరు సొంతం చేసుకుంటారు? ఎవరు ఎలాంటి లాభాలను అందుకుంటారో ? చూడాలి.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×