BigTV English

Atchannaidu Fires on Botsa: భలే జోకులేస్తున్నారు బొత్స గారు.. జనం నవ్వుతారు.. వద్దులెండీ: అచ్చెన్నాయుడు

Atchannaidu Fires on Botsa: భలే జోకులేస్తున్నారు బొత్స గారు.. జనం నవ్వుతారు.. వద్దులెండీ: అచ్చెన్నాయుడు

Minister Atchannaidu Fires on botsa Satyanarayana’s Tweet: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ పై టీడీపీ నేతలు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి సీఎంల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందంటూ బొత్స ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.


Also Read: చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్నా.. : జగన్

‘భలే జోకులేస్తున్నారు బొత్స గారు..! పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారు.. వద్దులెండీ? పారదర్శకతకు పాతరేసింది మీరు.. మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరంతా పని చేస్తున్నారు. బొత్స గారు దయచేసి పారదర్శకత.. వాస్తవాలు లాంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దు.. Now AP in Safe Hands.. Don’t Worry.. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. సమావేశమయ్యాక అన్ని విషయాలు తెలుస్తాయి’ అంటూ అచ్చెన్నాయుడు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.


Also Read: ప్రాణం నిలబెట్టే ఆసుపత్రులే నిజమైన దేవాలయాలు: మంత్రి సత్యకుమార్

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించారు. దాదాపు రెండు గంటలపాటు వారు చర్చించి.. సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల స్థాయిలో ఒక కమిటీ, అధికారుల స్థాయిలో మరో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ భేటీలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. అటు ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు సత్యప్రసాద్, జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, పలువురు అధికారులు హాజరయ్యారు.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×