BigTV English

Minister Nimmala: జగన్ క్షమాపణకు మంత్రి డిమాండ్..

Minister Nimmala: జగన్ క్షమాపణకు మంత్రి డిమాండ్..

Minister Nimmala: పట్టిసీమను వట్టిసీమ అన్న వైసీపీ అధినేత జగన్ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు జిల్లా ఉండవెల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేసి రెగ్యులేటర్ గేట్లను తెరిచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జగన్ అత్యంత అవసరమైన తాగు, సాగు నీటిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.


365 రోజులు ఇసుక, భూములు, మద్యం, గనులు దోచుకోవడంపై దృష్టి పెట్టి ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టి ప్రతి ఎకరాకు నీరందించే లక్ష్యంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. వైసీసీ ప్రభుత్వానికి ప్రాధాన్యత రంగాల గురించి తెలియకపోవడంతో ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేశారని మంత్రి  ఆరోపించారు. 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే చింతపూడి ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్ల ప్రాజెక్ట్ క్రింద ఉన్న ఆయకట్టు బీళ్లుగా మారుతోందని అన్నారు. దీని వల్ల తాగునీటిలో ఫ్లోరైడ్ సమస్య ఉత్పన్నమవుతుందని ఆరోపించారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని చంద్రబాబు చక్కదిద్దారని అన్నారు. మూడు రోజుల కింద పోలవరం కాల్వ నుంచి పట్టిసీమకు విడుదల చేసిన గోదావరి నీరు సోమవారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మలో కలిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన జలహారతి కార్యక్రమంతో పాటు మంత్రి చీర, సారె సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కరువుతో రైతులు అల్లాడిపోయారని అన్నారు. కక్ష సాధింపు తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.


Also Read: మాజీ సీఎం జగన్ సీరియస్.. సీఎం బాధ్యత వహించాలని డిమాండ్

ఎంపీ కేశినేని శివనాథ్ గుడివాడ ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.. కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఆదుకోవడానికి చంద్రబాబు అధికారం చేపట్టిన నెలకే పట్టిసీమ నీటిని విడుదల చేయించారని అన్నారు. పట్టిసీమ వైపు పీకేస్తానని చెప్పిన జగన్ నేడు పార్టీని పీకేసే స్థితిలోకి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కడప టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
కృష్ణమ్మ ఒడిలో గోదారమ్మ:
చంద్రబాబు ముందుచూపుతో గోదావరి జలాల్ని కృష్ణా ప్రాంతలకు చేర్చి కృష్ణా డెల్టాను పంటలతో సస్యశ్యామలం చేసేందుకు గతంలో బాటలు వేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కొన్ని వేల ఎకరాలకు నీరు లేక రైతులు నష్టపోయాని మండిపడ్డారు. మళ్లీ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే గోదావరి జలాలను విడుదల చేయడంతో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం జలకళ సంతరించుకుంది. దీంతో రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిస్తోంది.

 

Tags

Related News

AP News: ధర్మవరంలో పాక్ టెర్రరిస్టులు? డైలీ ఆ దేశానికి కాల్స్.. NIA కస్టడీలోకి ఇద్దరు తీవ్రవాదులు

JanaSena Party: జనసేనలోకి రీఎంట్రీ.. జేడీ లక్ష్మీనారాయణకు కీలక బాధ్యతలు?

AP Rains: ఏపీలో 3 రోజులు దంచుడే.. ఈ 10 జిల్లాల్లో భారీ వర్షాలు

Prakasam district: దారుణం.. తండ్రి అప్పు తీర్చలేదని తన కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి

Babu Pawan Lokesh: శౌర్యం, శాంతం, సమరం.. RRR లాగా.. SSS

Jagan: పులివెందుల రిజల్ట్.. జగన్ కామెంట్స్ వెనుక

Big Stories

×