E-Paper
Advertisement

RRR: క్రికెట్ ఆడుతూ బొక్కబోర్లా పడ్డ రఘురామ కృష్ణంరాజు, ఫోటోలు వైరల్

RRR: క్రికెట్ ఆడుతూ బొక్కబోర్లా పడ్డ రఘురామ కృష్ణంరాజు, ఫోటోలు వైరల్
Advertisement

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఏపీ ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా తలపడుతున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన ఈ ఆటవిడపు కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. నిత్యం రాజకీయ విమర్శలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమలోని క్రీడాకారుడిని బయటకు తీశారు. స్పోర్ట్స్  డ్రెస్సుల్లో మైదానంలోకి అడుగుపెట్టిన ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా వివిధ క్రీడల్లో పాల్గొంటున్నారు.

నిన్న ప్రారంభమైన కబడ్డీ పోటీలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. కూతకు వెళ్తూ ప్రత్యర్థులను అడ్డుకుంటూ ఎమ్మెల్యేలు అసలైన క్రీడా స్ఫూర్తిని చాటారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ భుజానికి స్వల్ప గాయమైంది. అయినప్పటికీ మిగిలిన వారు ఏమాత్రం తగ్గకుండా 100 మీటర్ల పరుగు పందెం, వాలీబాల్, టెన్నికాయిట్ వంటి ఆటల్లో పోటీ పడ్డారు. వయసును పక్కన పెట్టి కుర్రాళ్లలా మైదానంలో పరుగులు తీస్తుంటే చూసేందుకు వచ్చిన అభిమానులు కేరింతలు కొట్టారు.

Advertisement

రెండో రోజు ఆటల్లో భాగంగా ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు బ్యాటింగ్ చేస్తుండగా ఒక ఫాస్ట్ బాల్‌ను అద్భుతమైన షాట్‌గా మలిచారు. బంతిని ఫీల్డర్ అందుకున్న క్రమంలో వేగంగా పరుగు తీసేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే వికెట్ల సమీపంలోకి రాగానే నియంత్రణ కోల్పోయి పిచ్‌పై కింద పడిపోయారు. ఒక్కసారిగా గ్రౌండ్‌లో ఉన్న మిగిలిన నేతలు కొంత ఆందోళనకు గురయ్యారు.

వెంటనే తోటి ప్రజా ప్రతినిధులు ఆయన వద్దకు చేరుకుని పైకి లేపారు. అదృష్టవశాత్తూ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఆయన నవ్వుతూ ఆటను కొనసాగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రఘురామ కృష్ణరాజు కింద పడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆటలో గెలుపోటములు, ఒడిదొడుకులు సహజమని నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.

Advertisement

ఈ క్రీడల వల్ల నేతల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒత్తిడితో కూడిన రాజకీయ జీవితంలో ఇలాంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. రేపటితో ఈ వేడుకలు ముగియనున్నాయి.

ALSO READ: Nagarkurnool Municipal Elections: నాగర్‌కర్నూల్ మున్సిపల్ ఎన్నికల్లో.. ఇద్దరు జనార్దనులు కలిసి వేసిన స్కెచ్ బెడిసి కొట్టిందా?

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×