OTT Movie : ఓటిటిలో హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమాలు ఒంటరిగా చూడాలంటే కాస్త ధైర్యం కావాలి. కొన్ని సినిమాలు రాత్రిపూట చూడాలంటే పైప్రాణాలు పైకి పోతాయి. ఇప్పుడు హర్రర్ సినిమాలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. వీటిని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన ఒక స్టోరీని, వెండి తెరమీద అద్భుతంగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. ఈ మూవీలో సైన్స్, దెయ్యాల మధ్య చర్చ నడుస్తుంది. ఒళ్ళు గగుర్పాటు చెసే ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “ఎగ్జార్సిజం ఆఫ్ ఎమిలీ రోస్” (Exorcism of emily rose). ఈ మూవీలో వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు చాలానే ఉంటాయి. ఒక అమ్మాయిలో కొన్ని దయ్యాలు చేరి, ఆ అమ్మాయిని ఏం చేస్తాయనే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఏమిలీ అనే అమ్మాయి చదువుకోవడానికి ఒక యూనివర్సిటీ కి వెళుతుంది. అక్కడ బాయ్ ఫ్రెండ్ తో కలిసి చదువును కొనసాగిస్తుంది. అయితే ఒక రోజు ఆమె ప్రవర్తన చాలా భయంకరంగా ఉంటుంది. ఎమిలీ బాయ్ ఫ్రెండ్ కంగారుపడి ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్తాడు. ఏమిలీ తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకు వెళ్ళి, ఒక డాక్టర్ ని సంప్రదించి ట్రీట్మెంట్ చేయిస్తారు. ఇది జరుగుతుండగా ఒక చర్చి ఫాదర్ ఏమిలీ దగ్గరకు వచ్చి ఇది మెడిసిన్ తో తగ్గేది కాదని చెప్తాడు. ఆమెకు ట్రీట్మెంట్ వేరే ఉందని చెప్పి ఆమెపై ఎగ్జార్సిజం చేస్తాడు. ఇది జరిగిన మరుసటిరోజు ఆమె చనిపోతుంది. ఆమె చావుకి చర్చి ఫాదర్ కారణమని కొంతమంది ఫాదర్ పై కేసు వేస్తారు. కోర్టులో ఏమిలీ మానసిక రోగంతోనే చనిపోయిందని డాక్టర్లు వాదిస్తారు. ట్రీట్మెంట్ ఇస్తుండగా మెడిసిన్స్ ను ఆమె వేసుకోకుండా చేసి, చర్చి ఫాదర్ ఎగ్జార్సిజం చేయడం వల్లే ఆమె చనిపోయిందని గట్టిగా వాదిస్తారు.
అయితే ఫాదర్ కి సపోర్ట్ గా ఉన్న ఒక లాయర్ ఇందులో నిజాలను వెలుగు తీయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే లాయర్ ఏమిలీ బాయ్ ఫ్రెండ్ ను కలిసి కొన్ని విషయాలు తెలుసుకుంటుంది. ఆమెలో ఉన్న ఆత్మ ఒకటి కాదని, కొంతమంది వ్యక్తుల ఆత్మ ఉందని తెలుసుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఆమె చనిపోయే ముందు రోజు, ఫాదర్ ఆమెపై ఎగ్జార్సిజం చేయడం తోనే ఆమె చనిపోయిందని కోర్టును గట్టిగా నమ్మిస్తాడు డాక్టర్. చివరికి లాయర్ ఫాదర్ నిర్దోషని నిరూపిస్తాడా? ఆత్మలు ఉన్నాయని లాయర్ ప్రూఫ్ చేస్తుందా? ఎమిలీ లో ఉన్న ఆత్మలు ఎవరివి? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ని తప్పకుండా చూడండి. ఈ మూవీని లైట్లు ఆఫ్ చేసి,రాత్రిపూట మాత్రమే చూడండి.