BigTV English

Ananya Panday: దాని గురించి ఓపెన్‌గా మాట్లాడను, ఎన్నో కారణాలు ఉన్నాయి.. హేమ కమిటీపై అనన్యా పాండే స్పందన

Ananya Panday: దాని గురించి ఓపెన్‌గా మాట్లాడను, ఎన్నో కారణాలు ఉన్నాయి.. హేమ కమిటీపై అనన్యా పాండే స్పందన

Ananya Panday: ఒకప్పుడు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు.. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో తమపై జరిగే అఘాయిత్యాల గురించి చెప్పడానికి ముందుకు వచ్చేవారు కాదు. అలా చేస్తే వారి కెరీర్ ముగిసిపోతుందని భయపడేవారు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు చాలా మారిపోయాయి. పెద్ద పెద్ద స్టార్లు సైతం సినిమాల్లో అవకాశాల పేరుతో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఓపెన్‌గా చెప్తున్నారు. యంగ్ హీరోయిన్లు కూడా ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే కూడా ఇండస్ట్రీలో ఆడవారిపై ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.


సలహాలు ఇస్తుంటారు

తాజాగా ‘కాల్ మీ బే’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనన్యా పాండే. ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూలు దక్కాయి. ఈ సిరీస్‌లో ‘మీ టూ’ మూమెంట్ గురించి కూడా ఉందని అనన్యా చెప్పుకొచ్చింది. అలాంటి విషయాల గురించి తన పర్సనల్ లైఫ్‌లో మాట్లాడడానికి ఇబ్బందిపడతానని బయటపెట్టింది. ‘‘ఒక నటిగా అప్పుడప్పుడు నేను చాలా నిస్సహాయంగా ఫీలవుతుంటాను. ఎందుకంటే నా చుట్టూ ఉన్నవారు నన్ను పొలిటికల్‌గా మాట్లాడకు, అలా మాట్లాడకు, ఇలా మాట్లాడకు అని సలహాలు ఇస్తుంటారు. నేను అయితే అలాంటి మాటలకు వెంటనే ప్రభావితం అయిపోతాను’’ అని తెలిపింది అనన్యా.


Also Read: సౌత్‌లో ఇంకా అదే పాత పద్ధతి, అలా చేయడం వెర్రితనం.. యంగ్ యాక్టర్లకు రకుల్ సలహా

అలాంటివి ముఖ్యం

‘‘కాల్ మీ బే’లో ఆడవారిని సపోర్ట్‌గా నిలవడం, మహిళా సాధికారత, మీ టూ గురించి మాట్లాడాం. దాని గురించి నేను పర్సనల్ లైఫ్‌లో అంత ఓపెన్‌గా మాట్లాడలేకపోవచ్చు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ నేను చేసే వర్క్ ద్వారా దాని గురించి మాట్లాడగలిగితే అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందని నా నమ్మకం’’ అని తెలిపింది అనన్యా పాండే. ఇక హేమ కమిటీపై కూడా తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘ప్రతీ ఇండస్ట్రీలో మహిళలు అంతా ఒక్కటై హేమ కమిటీలాంటిది ప్రారంభించడం చాలా ముఖ్యం. మహిళలకు మహిళలే సాయంగా ఉండడం కోసం ఇలాంటివి చేస్తున్నారు. దానివల్లే మార్పులు వచ్చాయని కూడా నాకు అనిపిస్తోంది. కనీసం మహిళలు ముందుకొచ్చి తమ సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఇలాంటి యుద్ధాలు ఎన్నో చేయాలి’’ అని చెప్పింది అనన్యా.

హెల్ప్‌లైన్ నెంబర్స్

‘‘ప్రస్తుతం మహిళలకు సాయంగా ఉండడం కోసం హెల్ప్‌లైన్ నెంబర్స్ ఏర్పాటు అయ్యాయి. ప్రత్యేకంగా సెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ నిజంగానే మహిళలకు చాలా ముఖ్యం. మా కాల్ షీట్స్‌లో కూడా హెల్ప్‌లైన్ నెంబర్స్ ఉన్నాయి. మేము వాటికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ సమస్యలు కేవలం సినీ పరిశ్రమలోనే లేవు. ఇలాంటివి సమాజంలో కూడా తగ్గించడానికి ప్రయత్నించాలి’’ అంటూ మొదటిసారి ఇలాంటి విషయాలపై స్పందించింది అనన్యా పాండే. ఇక సినిమాలతో పెద్దగా హిట్లు అందుకోలేకపోయిన అనన్యా.. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయిన ‘కాల్ మీ బే’ సిరీస్‌తో హిట్ ట్రాక్ ఎక్కింది.

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×