BigTV English

Kadambari Jethwani: ఆ రోజు జరిగింది చెబుతూ.. పోలీసుల ముందు కాదంబరి కన్నీళ్లు, గుండె బరువెక్కడం ఖాయం!

Kadambari Jethwani: ఆ రోజు జరిగింది చెబుతూ.. పోలీసుల ముందు కాదంబరి కన్నీళ్లు, గుండె బరువెక్కడం ఖాయం!

YSRCP: పోలీసుల విచారణలో ముంబయి నటి జెత్వానీ ఏడ్చేసింది. విజయవాడలోని ఓ హోటల్‌లో ప్రస్తుతం జెత్వానీ ఉన్నది. ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేయడానికి విచారణాధికారి స్రవంతి రాయ్ ఆ హోటల్ చేరుకున్నారు. విచారణ సమయంలో ముంబయి నటి కన్నీటి పర్యంతమైంది. జిందాల్ పై అత్యాచారం కేసు నుంచి ఆ తర్వాత జరిగిన అనేక ఘటనలను వివరిస్తూ కంటతడి పెట్టుకుందని సమాచారం. తనను వీటీపీఎస్ గెస్ట్ హౌజ్‌లో బంధించినప్పుడు పోలీసులు హరాస్ చేసిన వివరాలనూ ఆమె చెప్పుకున్నట్టు తెలిసింది. రేప్ కేసు ఫైల్ అయిన గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరక జరిగిన ఘటనలను పూసగుచ్చినట్టు వివరించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విచారణాధికారులు ఆమె నుంచి స్టేట్‌మెంట్‌ను వీడియో రూపంలోనూ భద్రపరిచారు. పోలీసులు అన్ని రకాల టెక్నాలజీ సదుపాయాలనూ దర్యాప్తులో ఉపయోగించి కేసును ఛేదించడానికి సిద్ధమయ్యారు.


Also Read: IRCTC: రైల్వే శాఖ గుడ్ న్యూస్.. దసరా, దీపావళి పండుగలకు స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే!

తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్రలోనూ ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. నిజానిజాలు నిగ్గు తేల్చడానికి డైనమిక్ పోలీసు ఆఫీసర్, విజయవాడ ఏసీపీ స్రవంతి రాయ్‌ను విచారణ అధికారిగా ప్రభుత్వం అపాయింట్ చేసింది.


కాదంబరి జెత్వానీ ఇది వరకే పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదు. ఈ కేసులో దర్యాప్తు మొదలు పెట్టడానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలనే సలహాలు లీగల్ అడ్వైజర్లు ఇచ్చినట్టు తెలిసింది. నోవోటెల్ హోటల్‌లో కాదంబరి జెత్వానీ.. తన లీగల్ అడ్వైజర్లతో భేటీ అయ్యారు. తాను పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలనే నిర్ణయానికి జెత్వానీ వచ్చినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. మంగళగిరి ఎకో పార్క్‌లో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ కేసుపై కామెంట్ చేశారు. ముంబయికి చెందిన ఓ యువతిని ఇక్కడి పోలీసులు కొందరు తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఇలా చేస్తే.. ఇక రక్షణ ఎవరు ఇస్తారన్నారు. ఇది వరకే ఈ కేసుపై సీరియస్‌గా ఆయన రియాక్ట్ అయ్యారు.

Also Read: Kadambari Jethwani: ఆ రోజు జరిగింది చెబుతూ.. పోలీసుల ముందు కాదంబరి కన్నీళ్లు, గుండె బరువెక్కడం ఖాయం!

ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె చెప్పిన వివరాలను రికార్డు చేసుకున్నారని తెలిసింది. రికార్డు స్టేట్‌మెంట్ కోసం ఆమె ఇప్పుడు సీపీ ఆఫీసుకు బయల్దేరినట్లు సమాచారం. ముంబయి నటి కాదంబరి జెత్వాని తన న్యాయవాదులతోపాటు విజయవాడ సీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఏసీపీ స్రవంతి రాయ్ జెత్వానీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నట్టు తెలిసింది.

ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఓ వైసీపీ నేత ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఈ కేసుపై పేర్ని నాని కామెంట్ చేస్తూ.. దీనికి తమకు సంబంధం లేదని, ఈ కేసులో పేర్కొన్న వైసీపీ నేత పార్టీ గుమ్మం తొక్కలేదని తెలిపారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×