Varra Ravindra Reddy: వైసీపీ హార్డ్‌కోర్ సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి కోసం ఏపీ పోలీసులు వేట మొదలుపెట్టారా? వర్రా రాష్ట్రాలు దాటి వెళ్లిపోయాడా? రెండురోజుల కిందట పోలీసుల అదుపులో ఉన్న ఆయన ఎలా తప్పించుకున్నాడు? వైసీపీ పెద్దల నుంచి స్థానిక పోలీసులకు సంకేతాలు వచ్చాయా? చేసింది చేసి.. ఇప్పుడు పోలీసులు సెర్చింగ్ మొదలు పెట్టారా? ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజలను వెంటాడుతున్నాయి.
అధికార పార్టీ నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టుల పెట్టిన వర్రా రవీంద్రారెడ్డి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ప్రస్తుతం కడపతోపాటు అనంతపురం జిల్లాల్లో ఆయన కోసం వెతుకులాట మొదలుపెట్టారు పోలీసులు. ప్రస్తుతం వర్రా రాష్ట్రం దాటిపోయాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రవీంద్రారెడ్డి కోసం నాలుగు పోలీస్ బృందాలు ఏర్పాటయ్యాయి. ఆయన కోసం అనంతపురం, కడప జిల్లాల్లో రెండు టీమ్‌లు సెర్చింగ్ మొదలుపెట్టారు. మరో టీమ్ బెంగుళూరు వెళ్లింది. నాలుగో టీమ్ మాత్రం వర్రా పట్టుబడిన నుంచి తప్పించుకునే జరిగిన కాల్ డేటా సేకరించే పనిలో నిమగ్నమైందని సమాచారం.
ఈనెల ఐదున రాజంపేట పోలీసులు వర్రాపై కేసు నమోదు చేశారు. అదే రోజు సీఎం చంద్రబాబు ఫ్యామిలీపై నీచమైన పోస్టులు పెట్టాడు ఆ వ్యక్తి. దీనిపై కడపలో మరో కేసు నమోదు అయ్యింది. కడప ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడ్ని స్టేషన్‌కు తీసుకొచ్చారు.
ALSO READ: 15వ తేదీన అన్నాభిషేకం.. మీరు పాల్గొంటున్నారా.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?
అదే సమయంలో రాజంపేట నుంచి మరో టీమ్ కడపకు వచ్చింది. ఈలోగా మారువేషంలో అక్కడి నుంచి తప్పించుకున్నాడు వర్రా రవీంద్రారెడ్డి. అయితే వర్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కొందరు వైసీపీ మద్దతుదారులైన పోలీసులు జిల్లా నేతలకు సమాచారం ఇచ్చారట.
అందులో ఓ సీఐ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. తనకున్న పరిచయాలతో వర్రాను ఆయనే తప్పించాడంటూ పోలీసుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో రాజంపేట నుంచి వచ్చిన ఎస్ఐ పాత్రపై అనుమానాలు జోరందుకున్నాయి.
వర్రా వ్యవహారంలో కిందిస్థాయి పోలీసులు చేసిన పనికి పైస్థాయి అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. ఇదే క్రమంలో వర్రాను అరెస్ట్ చేసిన నుంచి పారిపోయే వరకు జరిగిన తతంగంపై పోలీసులు దృష్టి సారించారట. కాల్ డేటాను సేకరించే పనిలో పడ్డారట. ఇందులో ఇంకెంతమంది పోలీసులు బయటపడతారో చూడాలి. వర్రా పట్టుబడితే వైసీపీ పెద్ద తలకాయలు దొరకడం ఖాయమని అంటున్నారు.