BigTV English

AP : అమరావతిలో లక్ష మంది వేశ్యలా? అసలు నిజాలు ఇవే..

AP : అమరావతిలో లక్ష మంది వేశ్యలా? అసలు నిజాలు ఇవే..

AP : ఏపీ రాజకీయాలు రగిలిపోతున్నాయి. అమరావతి వేశ్యల రాజధానా అంటూ మహిళలు కనకదుర్గల్లా కన్నెర్రజేస్తున్నారు. సాక్షి జర్నలిస్ట్ కృష్ణంరాజు కనిపిస్తే చీరేస్తామని అంటున్నారు. ఇప్పటికే యాంకర్ కొమ్మినేనిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఇంత రచ్చ జరుగుతున్నా.. నాలుగేళ్ల తర్వాత చూసుకుంటాం అంటూ జగన్ బెదిరింపులు ఆపలేదు. అమరావతి మహిళలు పిశాచాలు, రాక్షసులు, సంకర తెగ అంటూ సజ్జల మరింత అగ్గి రాజేశారు. ఇంతటి ఆగ్రహ జ్వాలకు కారణం రెండు విషయాలు. ఒకటి.. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ (PMPSE) చేసిన సర్వే. మరొకటి.. ఆ సర్వేను బేస్ చేసుకుని సాక్షి టీవీ డిబేట్‌లో చేసిన కామెంట్స్.


సర్వేలో అసలేముంది?

ఏపీలో సుమారు లక్ష 20 వేల మంది మహిళలు వ్యభిచారం ఊబిలో ఉన్నారని సర్వే తెలిపింది. జాతీయ స్థాయిలో నెంబర్ 2 పొజిషన్ ఏపీదేనట. కర్నాటక టాప్‌లో ఉండగా.. మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణలు ఏపీ తరువాత ప్లేసెస్‌లో ఉన్నాయి. ఇక్కడే ట్విస్ట్. అదేంటి? ఏపీ మరీ అంత మంది వేశ్యలు ఉన్నారా? దేశంలోనే సెకండ్ ప్లేస్‌లో ఉండేంతలా అక్కడ తకిటతకిట నడుస్తోందా? అనే అనుమానం. ఆ సర్వే ఫలితాలు కలకలం రేపుతుండగానే.. సాక్షి మీడియాలో మహిళల మనోభావాలు దెబ్బతీసేలా మంట అంటించారు.


సాక్షిలో గొడవేంటి?

కొమ్మినేని శ్రీనివాసరావు తెలుసుగా. పక్కా వైసీపీ. జగన్ మనిషి. అతనికి టీడీపీ అన్నా.. అమరావతి అన్నా.. కడుపుమంట అంటారు. యాంకర్ ముసుగులో చెత్త చెత్త డిబేట్లు పెడుతూ.. చెత్తంతా వాగుతుంటారని విమర్శ ఉంది. ఈసారి ఆ వాగుడు హద్దు మీరింది. కొమ్మినేనికి జర్నలిస్ట్ కృష్ణంరాజు తోడయ్యారు. అతనూ అదే కంపెనీ. ఏపీలో వేశ్యల సర్వేపై పండగ చేసుకున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆ క్రమంలోనే సర్వేలో చెప్పిన వేశ్యలంతా అమరావతి ప్రాంతంలోనే ఉన్నారంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం ఇంతటి వివాదానికి కారణమైంది.

ఆ మహిళలు వేశ్యలా?

కృష్ణంరాజు మాటలను బట్టి.. అమరావతిలో లక్ష మంది వేశ్యలు ఉన్నారా? అసలు అంతమంది ఉంటారా? అమరావతి జనాభా ఎంత? అది ఎలాంటి ప్రాంతం? అక్కడ ఉండేదంతా రైతులు. అచ్చ తెలుగు మహిళలు. ఏపీ రాజధానిని అంతర్జాతీయ నగరంగా మార్చడంలో తమ భూములను త్యాగం చేసిన కుటుంబాలు. అలాంటి స్త్రీ మూర్తులను వేశ్యలంటూ కామెంట్ చేయడంతో ఇప్పుడు అమరావతి రగిలిపోతోంది. కొమ్మినేని, కృష్ణంరాజు ఫోటోలను చెప్పులతో కొట్టి తమ కోపం కాస్తైనా తీర్చుకున్నారు అక్కడి మహిళలు.

అమరావతిపై కుట్రలు ఆపరా?

గతంలో అమరావతిని స్మశానంతో పోల్చారు. ఇప్పుడు వేశ్యలు అంటున్నారు. మారరా? మీరిక మారరా? 11 సీట్లతో ఇప్పటికే ఏపీ ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు. అయినా, తీరు మారట్లేదా? బుద్ధి రావట్లేదా? ఏపీ వ్యాప్తంగా సర్వే చేస్తే.. ఏపీలో లక్షా 20 వేల మంది వరకు వేశ్యలు ఉన్నారని ఆ సర్వే చెబితే.. వాళ్లంతా అమరావతిలోనే ఉన్నారంటూ అలా ఎలా మాట్లాడుతారు? అసలు వాళ్లు మనుషులేనా? అందుకే ప్రభుత్వ రంగంలోకి దిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. కొమ్మినేనిని జైల్లో పెట్టింది. పరారీలో ఉన్న కృష్ణంరాజు సైతం ఊచలు లెక్కబెట్టాల్సిందే. చంద్రబాబు నాయకత్వంలో అమరావతి 2.0 పనులు వేగంగా జరుగుతుండటంతో ఓర్వలేకే.. ఇలా వేశ్యల రాజధాని అంటూ మంట రాజేశారని అంటున్నారు.

సజ్జలకు క్రొకడైల్ ఫెస్టివలేనా?

కొమ్మినేని, కృష్ణంరాజులు వాగిందే తప్పు అయితే.. వారికి మద్దతుగా జగన్, సజ్జలలు రియాక్ట్ అవడం మరింత దారుణం. నాలుగేళ్ల తర్వాత తామొస్తాం.. మీ సంగతి చూస్తాం.. అంటూ జగన్ బెదిరింపులకు అమరావతి రైతులు భయపడతారా? రాజధాని ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసినప్పుడే బెదరలేదు.. లొంగలేదు. ఇప్పుడు ఎక్కడో బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చొని.. ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తే హడలిపోయేంత అమాయకులు కాదు అమరావతి ప్రజలు. ఇక సజ్జల వ్యాఖ్యలు మరింత కంపరంగా ఉన్నాయి. అన్నవాళ్లను వదిలేసి.. మళ్లీ అమరావతి మహిళలపైనే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. ఆ మహిళల్ని పిశాచాలుగా, రాక్షసులుగా, సంకర తెగ అంటూ ఏదేదో అన్నారు. సజ్జల సంగతి సైతం తేలుస్తామంటూ రఘురామ ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలా అమరావతి మహిళల చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. సర్వేలో నిజమెంతో కానీ.. సాక్షి డిబేట్‌లో రేగిన మంట ఇప్పట్లో చల్లారేలా లేదు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×