Lavanya Tripathi : మెగా ఇంటికోడలుగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ఒకరు. అందాల రాక్షసి(Andala Rakshasi) సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ఉత్తరాది అమ్మాయి తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని తెలుగు అమ్మాయిగా గుర్తింపు పొందారు. ఇలా తెలుగమ్మాయిగా గుర్తింపు పొందడమే కాదండోయ్ ఏకంగా తెలుగు ఇంటి కోడలుగా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ను ప్రేమించి పెళ్లి చేసుకుని మెగా ఇంటి కోడలుగా లావణ్య త్రిపాఠి అడుగుపెట్టారు.
మెగా ఇంటికోడలు..
ఇలా మెగా కోడలుగా గుర్తింపు పొందిన ఈమె పెళ్లి తర్వాత ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు కానీ త్వరలోనే తల్లి కాబోతున్న విషయాన్ని అందరికీ తెలియజేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన లావణ్య ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారని చెప్పాలి. లావణ్య సినీ కెరియర్ విషయానికి వస్తే… హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల రాక్షసి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు లావణ్య త్రిపాఠి వచ్చారు. ఈ సినిమాలో మిధున అనే పాత్రలో ఈమె ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.
రీ రిలీజ్ …
ఇక ఈ చిత్రంలో నవీన్ చంద్ర(Naveen Chandra), రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 2012వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అద్భుతమైన ప్రేమకథాచిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా మరోసారి థియేటర్లలో విడుదల అవ్వడానికి సిద్ధమవుతుంది.. ఇటీవల కాలంలో రీ రిలీజ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అందాల రాక్షసి సినిమా కూడా తిరిగి విడుదలకు సిద్ధమైంది.
పెళ్లి చేసేయండి నాన్న…
ఈ సినిమా జూన్ 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి హీరోలు నవీన్ చంద్ర రాహుల్ రవీంద్రన్ తో కలిసి హాజరయ్యారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో నాకు పెళ్లి చేసేయండి నాన్న ఈ చదువులు గిదువులు నావల్ల కావట్లేదు అంటూ చెప్పిన డైలాగ్ భారీగా ఫేమస్ అయ్యింది. అయితే మరోసారి ఇదే డైలాగ్ చెబుతూ… నాకు పెళ్లి చేసేయండి నాన్న ఈ చదువులు నావల్ల కావట్లేదు..అలా చూడకండి మరో మూడు రోజుల్లో మీ ముందుకు వస్తున్నాం.. ఒట్టుగా అంటూ చాలా క్యూట్ గా ఈ డైలాగ్ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు.