BigTV English

KA Paul: మరో కామెడీ స్టేట్ మెంట్ ఇచ్చిన కేఏ పాల్

KA Paul: మరో కామెడీ స్టేట్ మెంట్ ఇచ్చిన కేఏ పాల్

AP political leader KA Paul filed petition in high court about state special status: తెలుగు రాష్ట్రాలలో కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఏం మాట్టడినా..చేం చేసినా అది కామెడీగానే తీసుకుంటారు జనం. ఏ విషయాన్ని అయినా సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తారు. ఎవరినీ లెక్క చేయరు. వందకు పైగా దేశాలలో పర్యటించానని..ప్రపంచ దేశాధ్యక్షులంతా తనతో టచ్ లో ఉన్నారని అంటుంటారు. క్రమం తప్పకుండా ఏపీలో ప్రతి ఎన్నికలలో పోటీచేస్తారు. కనీసం డిపాజిట్లు దక్కకపోయినా ఫీలవ్వరు. తాను ఓటు కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయనని అంటారు. తనని గెలిపిస్తే ప్రపంచ దేశాలనుంచి ఆంధ్రాకు నిధులు తీసుకొస్తానని అంటుంటారు. అయితే ఆయన ఎంతగా గొంతు చించుకున్నా జనం మాత్రం కామెడీగా తీసుకుంటారు. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా కేఏ పాల్ తన ప్రజా శాంతి పార్టీ తరపున సిన్సియర్ గానే ప్రచారం చేశారు. ఆవేశంతో ఆయన ఇచ్చిన హామీలన్నీ జనం నమ్మలేదు. పైగా నవ్వుకున్నారు.


అందరూ మర్చిపోయిన అంశం

ఇప్పుడు అధికారంలోకి చంద్రబాబు అండ్ కో కూటమి వచ్చేసింది. ఎన్నికలు మరో ఐదేళ్ల దాకా ఉండవు. అటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా రాజకీయాలలో చురుకుగా ఉండటం లేదు. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో తానొక్కడే ఒంటరి పోరాటం చేయవలసి ఉంటుందని..టీడీపీ నేతలు తనని అవమానిస్తారని భావించిన జగన్ ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. ఇప్పుడు ఏపీ సైలెంట్ గా మారిపోయింది. అయితే హఠాత్తుగా కేఏ పాల్ మదిలో ఓ సంచలన ఆలోచన కలిగింది. ప్రత్యేక హోదా అంశాన్ని దాదాపు అన్ని పార్టీలు మర్చిపోయాయి. ఏపీ కూటమిలో స్వయంగా మోదీ పార్టీ కూడా భాగస్వామి గా ఉండి కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టడం లేదు. ఇక ప్రతి పక్ష నేతగా ఫెయిల్ అయిన వైఎస్ జగన్ కు ప్రత్యేక హోదా గురించి పట్టించుకునే తీరిక గానీ కోరికగానీ కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ కూడా కూటమి కి మద్దతుగా ఉండటంతో ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు ఏపీలో అడిగే నాధుడు గానీ, పట్టించుకునేవారు గానీ ఎవరూ లేరు.


ప్రజాప్రయోజన వాజ్యం

తనకు ఇదే సమయం అని గ్రహించారో ఏమో కేఏ పాల్ మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ కేఏ పాల్ ఎవరూ ఊహించని విధంగా హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటిషన్ దాఖలు చేశారు. పైగా లోక్ సభ ఎన్నికల సందర్భంగా కేంద్రం రాష్ట్రానికి హామీ ఇచ్చిందని..ఆ ప్రకటనలన్నీ క్లిప్పింగులుగా పెట్టి..ఇప్పుడు కేంద్రం హామీ ఇచ్చిన మేరకు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని హైకోర్టులో పాల్ పిటిషన్ వేశారు. ప్రత్యేక హోదా హామీని స్వయంగా ప్రధాని హోదాలో ఉన్న మోదీనే ఇచ్చారని..ఇదేదో సాదాసీదా వ్యక్తి ఇచ్చింది కాదని న్యాయమూర్తికి విన్నవించారు పాల్. దీనితో ఇటు చంద్రబాబును అటు మోదీని ఇరికిస్తూ కేఏ పాల్ మంచి స్కెచ్చే వేశారని జనం అనుకుంటున్నారు.

మోదీ, సోనియాలనూ దోషులుగా చేసి..

తన పిటిషన్ లో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని..ఏపీకి తక్షణమే న్యాయం జరగాలంటే కోర్టు కలగజేసుకోవాలని పాల్ చెబుతున్నారు. అయితే తన పిటిషన్ లో కాంగ్రెస్ నేత సోనియా గాంధీని కూడా చేర్చారు.
ఏపీకి జరిగిన అన్యాయంపై వీరందరిపై న్యాయపోరాటం చేస్తానని కేఏ పాల్ చెబుతున్నారు. అయితే పాల్ వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవిస్తుందా? లేక పెండింగ్ లోనే ఉంచుతుందా అనేది వేచిచూడాలి. మొత్తానికి ఈ ఎపిసోడ్ కామెడీగా చూసినా దాని వెనక ఉన్న సీరియస్ నెస్ ఏమిటనేది తెలుస్తుంది. పబ్లిక్ సపోర్టు ఉంటేనే ఇలాంటి ప్రజా ఉద్యమాలు సక్సెస్ అవుతాయని పాల్ కూడా గ్రహించాలి అని రాజకీయ మేధావులు అంటున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×