AP SSC Result 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. ఇంతకీ ఫలితాలు విడుదల ఎప్పుడు? అన్నదానిపై విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ప్రైవేటు కాలేజీలు ముందుగా క్లాసులు మొదలుపెట్టేశాయి. అటు కాలేజీలకు వెళ్లలేక లోలోపల సతమతమవుతున్నారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్ మూడోవారంలో పదో తరగతి ఫలితాలు వెల్లడికావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం వారం రోజుల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసింది పాఠశాల విద్యాశాఖ. ఎక్కువమంది ఉపాధ్యాయులతో సకాలంలో ఈ ప్రక్రియ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఏప్రిల్ మూడు నుంచి ఏడు వరకు మూల్యాంకనం జరిగింది. దీని తర్వాత ఇంటర్మీడియట్ పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనకు ఏర్పాటు చేశారు. రోజుకు 40 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేస్తున్నారు అసిస్టెంట్ ఎగ్జామినర్స్. ఈసారి వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించాలన్న యోచనలో ఉంది విద్యా శాఖ.
మూల్యాంకనం చేసిన పత్రాల పునఃపరిశీలనలో మార్కుల తేడాలు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సంకేతాలు పంపించారు. మాల్యాంకన కేంద్రాల్లో సెల్‌ఫోన్లను నిషేధించింది ప్రభుత్వం. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏప్రిల్ 22న ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ALSO READ: పవన్ వల్ల పరీక్షలు మిస్సయ్యారా? అసలేంటి నిజం
ఏప్రిల్ కాకుండే మే మొదటి వారంలో 10 తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. పదో తరగతి ఫలితాలను వాట్సాప్ (9552300009) ద్వారా విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ప్రభుత్వానికి సంబంధించి మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 నెంబర్‌కు మెసేజ్ పెట్టగానే సేవను ఎంచుకోవాలంటూ ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కొన్ని సేవలు కనిపిస్తాయి. ఆ తర్వాత విద్య సేవలపై క్లిక్ చేయాలి. అందులో 10వ తరగతి లేదా ఎస్‌ఎస్‌సీ డౌన్‌లోడ్ పై క్లిక్ చేయాలి. ఫలితాలు డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో హాల్ టికెట్ లేదా ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఇచ్చిన తర్వాత సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ALSO READ: నటుడు పోసానికి మరో బిగ్ షాక్