BigTV English

Politcal Party Donations: జాతీయ పార్టీలకు విరాళాలు.. అగ్రస్థానం బిజేపీదే .. టాప్ 10 డోనర్లు వీరే

Politcal Party Donations: జాతీయ పార్టీలకు విరాళాలు.. అగ్రస్థానం బిజేపీదే .. టాప్ 10 డోనర్లు వీరే

ADR Report Politcal Party Donations| 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రూ.2,243 కోట్ల విరాళాలు పొందినట్లు వెల్లడయ్యింది. జాతీయ పార్టీలు అందుకున్న విరాళాల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బీజేపీకి అత్యధిక విరాళాలు అందినట్లు తేలింది.


ప్రస్తుతం అన్ని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల మొత్తం రూ.2,544.28 కోట్లు. ఈ మొత్తం 12,547 విరాళాల ద్వారా అందింది. ఇందులో 88 శాతం బిజేపీనే చేజిక్కించుకుంది. గత ఏడాది పోలిస్తే.. ఈసారి విరాళాల మొత్తం 199 శాతం పెరిగినట్లు ఏడీఆర్ తన నివేదికలో వివరించింది. ఈ ఏడాది అందిన మొత్తం విరాళాలలో బీజేపీ ఒక్క పార్టీనే 88 శాతం వాటాను పొందింది. విరాళాల పరంగా 211 శాతం వృద్ధి నమోదైంది. నిబంధనల ప్రకారం.. రూ.20వేలకు మించి వచ్చిన విరాళాల వివరాలను రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది.

Also Read:  గుండె ఆపరేషన్లు చేసిన నకిలీ డాక్టర్‌.. ఏడుగురు మృతి


రెండోస్థానంలో కాంగ్రెస్
ఎడీఆర్ నివేదిక ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి రూ.281.48 కోట్ల విరాళాలు వచ్చాయి. మొత్తం 12,547 విరాళాలలో కాంగ్రెస్ పార్టీకి 1,994 విరాళాలు అందాయి. దీంతో కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (CPI-M), నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) వంటి ఇతర పార్టీలు తక్కువ విరాళాలు పొందాయి. బహుజన్ సమాజ్ పార్టీ (BSP) మాత్రం గతంలో మాదిరిగానే ఈసారి కూడా తమకు ఒక్క రూపాయి విరాళం కూడా అందలేదని ప్రకటించింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.719.858 కోట్ల విరాళాలు వచ్చినాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.2,243.94 కోట్లకు పెరిగింది. ఇది 211.72 శాతం పెరిగిందని నివేదిక వివరించింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.79.924 కోట్ల విరాళాలు లభించగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.281.48 కోట్లకు పెరిగింది. ఇది 252.18 శాతం పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది.

కార్పోరేట్ రంగం విరాళాలు..
ఇక కార్పొరేట్ కంపెనీలు అందించిన విరాళాల వివరాలను చూస్తే.. జాతీయ పార్టీలకు మొత్తం 3,755 విరాళాలు కార్పొరేట్ కంపెనీల ద్వారానే అందాయి. వాటిలో 88.9 శాతం అంటే రూ.2262.5 కోట్లు కమలం పార్టీకే అందాయి. కార్పొరేట్ కంపెనీలే కాకుండా వ్యక్తిగతంగానూ బిజేపీ అత్యధిక విరాళాలు అందాయి. రూ.169.126 కోట్ల విలువ చేసే 4,628 వ్యక్తిగత విరాళాలు ఆర్థిక సంవత్సరం 2023-24లో బిజేపీ పొందింది.

విరాళాలు ఇచ్చిన టాప్ 10 దాతల జాబితా

1. ప్రూడెంట్ ఎలెక్ట్రోరల్ ట్రస్ట్.. మొత్తం రూ.880 కోట్లు విరాళాలు బిజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇచ్చింది. వీటిలో రూ.723.6 కోట్లు బిజేపీకి, రూ.156.4 కోట్లు కాంగ్రెస్ కు అందాయి.
2.ట్రైయంఫ్ ఎలెక్ట్రోరల్ ట్రస్ట్.. బిజేపీకి రూ.127.5 కోట్లు విరాళాలు అందించింది.
3.డిరైల్ ఇన్‌వెస్ట్‌మెంట్స్.. రూ.50 కోట్లు బిజేపీకి.. రూ.3.2 కోట్లు హస్తం పార్టీకి ఇచ్చింది.
4. ACME సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్.. రూ.51 కోట్లు విరాళం ఇచ్చింది.
5. రుంగ్టా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఇచ్చిన విరాళం రూ.50 కోట్లు.
6.భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ₹50 కోట్లు విరాళంగా ఇచ్చింది
7. ఐటీసీ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ ₹80 కోట్లు విరాళంగా ఇచ్చింది
8. దినేష్ చంద్ర ఆర్. అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ బీజేపీకి ₹30 కోట్లు విరాళంగా ఇచ్చింది
9. దిలీప్ బిల్డ్‌కాన్ లిమిటెడ్ ₹29 కోట్లు విరాళంగా ఇచ్చింది
10. మాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్ ₹27 కోట్లు విరాళంగా ఇచ్చింది

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×