BigTV English

AP: ఆ టీచర్‌ను చంపేశారా? రాజకీయ కక్షలే కారణమా?

AP: ఆ టీచర్‌ను చంపేశారా? రాజకీయ కక్షలే కారణమా?
teacher death

AP breaking news today: శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ టీచర్ అనుమానాస్పద మృతి రచ్చ రాజేసింది. ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న కృష్ణమూర్తి స్కూల్‌కు వెళ్తుండగా.. ఒమ్మి కొత్తపేట సమీపంలో బొలేరో వ్యాన్ ఢీ కొట్టింది. టీచర్ కృష్ణ అక్కడికక్కడే చనిపోయాడు.


అయితే, ఇది ప్రమాదం కాదని.. ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కృష్ణ కుటుంబానికి సంఘీభావంగా స్థానికులు పెద్దసంఖ్యలో రోడ్డెక్కారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని బైఠాయించారు. గంటల తరబడి ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

టీచర్ కృష్ణమూర్తికి స్థానికంగా మంచి పేరుంది. ఆయన మాటపై గ్రామస్తులకు గట్టి నమ్మకం ఉంది. ఎన్నికల సమయంలో ఈ టీచర్ ఎవరికి ఓటు వేయాలని చెబితే.. ప్రజలంతా మూకుమ్మడిగా అతనికే ఓటు వేస్తారని అంటున్నారు. ఈ కారణంతోనే.. గత ఎలక్షన్‌లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థే.. కృష్ణమూర్తిని వాహనంతో గుద్ది చంపించాడని అనుమానిస్తున్నారు. అందుకే, టీచర్ మృతిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు స్థానికులు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×