Tech AI 2.0 Conclave: దేశమంతటా గుడ్డు రంగంలో చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్. పశుసంవర్ధక రంగంలో ఎన్నో మార్పులు, మెరుగుదలల దిశగా దూసుకుపోతున్న ఈ రాష్ట్రం ఇప్పుడు గుడ్ల ఉత్పత్తిలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది.
విజయవాడలో ఇటీవల నిర్వహించిన టెక్ AI 2.0 కాన్క్లేవ్ వేదికగా ఈ ఘనతను అధికారికంగా వెల్లడించారు. ఈ కాన్ఫరెన్స్‌ను పశుసంవర్ధక శాఖ, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ సంయుక్తంగా నిర్వహించాయి.
ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు పరిశ్రమ నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, రైతు ప్రతినిధులు, మరియు AI రంగ ప్రముఖులు రాష్ట్రంలో జరుగుతున్న మార్పులను ప్రశంసించారు. గుడ్డు ఉత్పత్తిలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ చరిత్ర సృష్టించింది. ఆ గౌరవాన్ని సొంతం చేసుకుంది. అలాగే మాంసం ఉత్పత్తిలో 5వ స్థానం, పాల ఉత్పత్తిలో 7వ స్థానం దక్కించుకోవడం పశుసంవర్ధక రంగంలో ఏపీ అందరికంటే ముందు ఉందని స్పష్టం చేసింది.
ఇవి చిన్న విజయాలు కావు. రాష్ట్ర GSDPలో పశుసంవర్ధక రంగం నుండి వచ్చే వాటా 11.23% కంటే ఎక్కువ. అంటే ఈ రంగం ఆర్థిక వ్యవస్థలో ఎంతటి పాత్ర పోషిస్తున్నదో స్పష్టమవుతుంది. ఈ కాన్క్లేవ్‌లో AI, డేటా అనలిటిక్స్, GPS ఆధారిత ట్రాకింగ్, లాంటి ఆధునిక సాంకేతికతలను పశుపాలనలో ఎలా వినియోగించవచ్చో ప్రదర్శించబడింది.
రైతులు మొబైల్ యాప్స్ ద్వారానే తమ పశువుల ఆరోగ్య సమాచారం తెలుసుకోవడం, టీకాలు, పోషకాహార నిర్వహణ వంటి వివరాలు సులభంగా పొందడం వంటి మార్గాలు ఇప్పుడు వాస్తవం అవుతున్నాయి.
ఈ రంగం మహిళల సాధికారతకు కూడా ప్రధాన ఆధారం. గుడ్డు ఉత్పత్తి, పౌల్ట్రీ ఫార్మింగ్ రంగాల్లో అనేక గ్రామీణ మహిళలు ఉపాధి పొందుతున్నారు. చిన్న రైతుల నుంచి పౌల్ట్రీ పారిశ్రామికుల వరకు ఈ విజయంలో పాత్ర వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దేశీయ పశువుల జాతులను బలోపేతం చేయడంలో ప్రత్యేక దృష్టి పెట్టింది. పాడి రైతులకు శిక్షణ ఇవ్వడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, వ్యవస్థాపిత మార్కెట్ లింకేజెస్ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Also Read: Visakhapatnam Metro: విశాఖ మెట్రోపై ఎందుకంత హడావుడి? అసలు కథ ఇదే!
2047 స్వర్ణ ఆంధ్ర లక్ష్యం.. గుడ్డుతోనే మొదలు
సుదీర్ఘ కాల దృష్టితో 2047 నాటికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చెందాలన్న లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ముందుపెట్టింది. ఆ దిశగా పశుసంవర్ధక రంగాన్ని స్మార్ట్, స్థిరమైన, ప్రపంచ శ్రేణిలో నిలిచే విధంగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుడ్డు రంగంలో ఏపీ సాధించిన ఈ గౌరవం, ఒక్క ఆర్థిక అభివృద్ధికే కాదు.. రాష్ట్రానికి సాంకేతికత, వ్యవసాయ పునరుద్ధరణ, గ్రామీణ సంక్షేమం అనే మూడు మార్గాల్లో మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ ఘనత వెనుక రాష్ట్ర రైతులు, శాస్త్రవేత్తలు, పాలనాపరులు, పాలకుల భాగస్వామ్యం ఉంది. నిజంగా చెప్పాలంటే.. గుడ్డు రికార్డ్ ఏపీకే.. ఆ క్రెడిట్ మాత్రం కోలుకోలేనిదే!
Delighted to take part in the Tech AI 2.0 Conclave organized by the Animal Husbandry Department and the Global Forum for Sustainable Transformation, in Vijayawada today.
It was inspiring to interact with various individuals who are contributing to animal husbandry through… pic.twitter.com/y62t3vmN6r
— N Chandrababu Naidu (@ncbn) May 14, 2025