Boycott Aamir Khan : ఆల్మోస్ట్ రెండు దశాబ్దాల తరువాత అమీర్ ఖాన్ (Aamir Khan) బ్లాక్ బస్టర్ మూవీ ‘తారే జమీన్ పర్’కి సీక్వెల్ గా రాబోతోంది ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par). కానీ మేకర్స్ సినిమా ప్రమోషన్లు అలా మొదలు పెట్టారో లేదో ఇలా చుక్కెదురైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో #BoycottSitaareZameenPar అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. మరి ఈ ట్రెండ్ కు కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.
అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ట్రైలర్ 2025 మే 13న విడుదలైంది. ఈ చిత్రం స్పానిష్ సినిమా ఛాంపియన్స్ (2018) హిందీ రీమేక్‌గా తెరకెక్కింది. అమీర్ ఖాన్ ఇందులో బాస్కెట్ బాల్ కోచ్‌గా, జెనీలియా డిసౌజాతో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమా 2007లో విడుదలైన ‘తారే జమీన్ పర్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. 2025 క్రిస్మస్ సందర్భంగా మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత, సోషల్ మీడియాలో ఈ సినిమాను నిషేధించాలనే డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి.
వివాదానికి కారణం ఏంటంటే?
టర్కీ అధ్యక్షురాలితో అమీర్ ఖాన్ గతంలో దిగిన ఫోటోలు వైరల్ కావడమే, ఇప్పుడు ‘సితారే జమీన్ పర్’ మూవీని బ్యాన్ చేయాలనే డిమాండ్ కు కారణం. ఇప్పుడే ఈ వివాదం ఎందుకు అంటే భారత్ – పాక్ యుద్ధం నేపథ్యంలో దాయాది దేశం చర్యలపై కోపంగా ఉన్నారు మనోళ్ళు. ఆ కోపాన్ని సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే టర్కీ పాక్ కు సాయం అందించడం, అదే దేశ అధ్యక్షురాలితో అమీర్ ఖాన్ మీటింగ్ కు సంబంధించిన ఫోటోలు మరోసారి వైరల్ కావడం, ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ కావడంతో వివాదం రాజుకుంది.
అయితే నిజానికి అమీర్ ఖాన్ టర్కీ అధ్యక్షురాలిని కలిసింది ఇప్పుడు కాదు. 2020లో అమీర్ ఖాన్ టర్కీలో ఆ దేశ ఫస్ట్ లేడీ ఎమినీ ఎర్డోగాన్‌తో సమావేశం అయ్యారు. ఆ సమయంలో ‘లాల్ సింగ్ చడ్డా’ షూటింగ్ కోసం ఆయన టర్కీలో వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం ఫోటోలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కొందరు నెటిజన్లు టర్కీ భారత వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇస్తోందని, ముఖ్యంగా పాకిస్తాన్‌కు సహాయం చేస్తోందని ఆరోపిస్తూ, అమీర్ సమావేశాన్ని భారత వ్యతిరేక చర్య అంటూ మండిపడుతున్నారు. అందుకే ఆయన ‘సితారే జమీన్ పర్’ సినిమాను బాయ్‌కాట్ చేయాలని లేదా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.
Read Also : ఈ విగ్రహానికి ఆకలేస్తే అంతే సంగతులు… ఏడిపిస్తూ ఏసేస్తుంది
అయితే అమీర్ ఖాన్ టర్కీ ఫస్ట్ లేడీతో సమావేశమైన ఫోటోలు 2020లో ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్‌ల సమయంలో కూడా వివాదాస్పదమయ్యాయి. కొందరు ఈ సమావేశాన్ని ‘లాల్ సింగ్ చడ్డా’ షూటింగ్ కోసం టర్కీ ప్రభుత్వంతో సహకారంగా భావించగా, ఇతరులు దీనిని భారత వ్యతిరేక దేశాలతో అమీర్ సంబంధాలకు సంకేతంగా చూశారు. అయితే ఈ సమావేశం సినిమా షూటింగ్ కోసమేనని, రాజకీయ ఉద్దేశం లేదని చిత్రబృందం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినా నెటిజన్ల కోపం చల్లారకపోవడంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై స్ట్రాంగ్ గా పడింది. మరిప్పుడు ఈ మూవీ పరిస్థితి ఏంటో !?
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కొత్త చిత్రానికి కష్టాలు
అమీర్ ఖాన్ కొత్త చిత్రం 'సితారే జమీన్ పర్'ను బాయ్‌కాట్ చేయాలంటున్న నెటిజన్లు
ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్
ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులు
టర్కీ అధ్యక్షురాలితో అమీర్ ఖాన్ గతంలో… pic.twitter.com/BIn8waz2z7
— BIG TV Breaking News (@bigtvtelugu) May 14, 2025