E-Paper
Advertisement

కాకినాడలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం ఘటన.. వెనక్కి వచ్చిన కుక్క ఎందుకు పారిపోయింది? చిన్నారి ఎక్కడ?

కాకినాడలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం ఘటన.. వెనక్కి వచ్చిన కుక్క ఎందుకు పారిపోయింది? చిన్నారి ఎక్కడ?
Advertisement

Kakinada: కాకినాడ మూడేళ్ల చిన్నారి అదృశ్యం ఘటన ఏమైంది? మూడు రోజుల తర్వాత చిన్నారి వెళ్లిన పెంపుడు కుక్క ఇంటికి వచ్చేసింది. మరి చిన్నారి ఎక్కడ? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. పాప కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు మొదలుపెట్టారు. తమ కూతురు వస్తుందని తల్లిదండ్రులు, వారి బంధువులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాకినాడలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం వ్యవహారంలో కొత్త మలుపు

Advertisement

కాకినాడ జిల్లా తునిలో మూడేళ్ల జ్ఞానేశ్వరి అనే చిన్నారి కనిపించలేదు. నాలుగు రోజుల కిందట అంటే శనివారం ఉదయం నుంచి చిన్నారి జాడ తెలియలేదు. పెంపుడు కుక్కతోపాటు చిన్నారి ఇద్దరు కనిపించకుండా పోయారు. ఈ విషయం గురించి తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా విడిపోయి 500 ఎకరాల అటవీ ప్రాంతంలో గాలింపు మొదలు పెట్టారు.

పాప కోసం మూడు రోజులుగా గాలింపు తీవ్రతరం చేశారు. మంగళవారం సాయంత్రం ఇంటికి సమీపంలోని ఓ కొండ వైపు నుంచి పెంపుడు కుక్క ఇంటికి వచ్చేసింది. దాన్ని చిన్నారి కుటుంబసభ్యులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడి నుంచి తిరిగి పారిపోయింది. పాప ఆచూకీ కోసం పోలీసులు కొండ చుట్టూ గాలిస్తున్నారు. పెంపుడు కుక్క గురించి తల్లిదండ్రులు కొన్ని విషయాలు బయట పెట్టారు.

Advertisement

వెనక్కి వచ్చిన కుక్క ఎందుకు పారిపోయింది? మరి చిన్నారి ఎక్కడ?

కుక్క రావడంతో పాప వెనక్కి వస్తుందని తాము ఆనందానికి గురయ్యామని, క్షణాల్లో ఆలోచనలు ఆవిరైపోయానని చెప్పుకొచ్చారు. అందరూ ఒక్కసారిగా అలర్ట్ కావడంతో భయంతో కుక్క పారిపోయిందన్నారు. ఇది వరకు కుక్క ఎప్పుడూ అలా చేయలేదంటున్నారు.  పోలీసుల జాగిలాలు రంగంలోకి దిగాయి. దీనికితోడు రెండు రోజులుగా వర్షం పడుతుండడంతో గాలింపుకు కాస్త ఆటంకంగా మారింది.

సీహెచ్‌ అగ్రహారానికి చెందిన సుంకర గణేష్-భవాని దంపతులకు మూడేళ్లు కుమార్తె జ్ఞానేశ్వరి ఉంది. ఈ దంపతులు గ్రామ శివార్లలోని ఓ పామాయిల్‌ తోటకు కాపలాదారులుగా ఉన్నారు. శనివారం నుంచి కూతురు కనిపించకపోవడంతో దంపతులు వెతికారు. కంగారు పడిన భవానీ దంపతులు చుట్టు పక్కల వారికి సమాచారం అందించారు. అటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ALSO READ: స్టీల్ ప్లాంట్ ఫ్యూచర్‌పై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. బాధితులకు జగన్ పరామర్శ, ప్రభుత్వంపై రుసరుసలు

 

Related News

ఢిల్లీ పార్లమెంట్‌లో భోగాపురం రచ్చ.. సీఎం చంద్రబాబుకు మంత్రి తనూజ రాణి సవాల్!

ప్రకాశం జిల్లాలో దారుణం.. బల్లులు పడిన జావ తాగిన విద్యార్థులు

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల..!

మెగా డీఎస్సీ వ్యవహారం.. హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ, సీబీఐ విచారణకు నిరాకరణ

నన్ను వాడుకుని వదిలేశారు.. వైఎస్‌ జగన్ నివాసం వద్ద బోరగడ్డ అనిల్ హల్‌చల్!

ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేయండి.. జైలుకెళ్లడానికైనా సిద్ధమే- అంబటి రాంబాబు

నత్తనడక పనులకు చెక్.. అధికారులకు పవన్ కళ్యాణ్ క్లియర్ డెడ్‌లైన్!

కోడిగుడ్డు‌పై ఈకలు పీకడం.. వైసీపీ విమర్శలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

Big Stories

Advertisement
×