Pawan Vs Venu Swamy: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్-అన్నా దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఈ విషయం అధికారికంగా బయటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల ఛానెళ్లు, టీవీల్లో హెడ్‌లైన్ అయ్యింది. విడిపోయినప్పటికీ తాము మిత్రులుగా ఉంటామని, పిల్లల పట్ల తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తామని మనసులోని మాట బయటపెట్టారు. ఈ వ్యవహారాన్ని తమకు అనువుగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు వ్యక్తులు. ఈ క్రమంలో జ్యోతిష్యుడు వేణుస్వామిని రంగంలోకి దించారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఈ సమయంలో ఆయా నేతల గురించి ఎలాంటి వార్తలు వచ్చినా.. గతంలో వారు మాట్లాడినవి, ప్రత్యర్థుల మాట్లాడిన వీడియోలు బయటకు తీసి వైరల్ చేయడం ఇటీవలకాలంలో మరింత ఎక్కువైంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం విషయంలో అదే చేస్తున్నారు కొందరు హార్డ్‌కోర్ అభిమానులు.
పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా విడాకుల ప్రకటన పవన్ స్టార్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు మొదలయ్యాయి. చాలా అన్యోన్యంగా ఉన్న పవన్ – లెజినోవా దంపతులు ఉండేవారు. ఇటీవల పవన్ అనారోగ్యానికి గురైనప్పుడు కాలినడకన తిరుమలకు వెళ్లారు లెజినోవా. ముంబై హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తర్వాత అక్కడికి వెళ్లారు.
కేరళంలో ఆయుర్వేద ట్రీట్‌మెంట్ తీసుకున్న పవన్25 రోజులు అక్కడే గడిపారు. అప్పుడు మాత్రం లెజినోవా దూరంగా ఉన్నారు. మెగా ఫ్యామిలీతో ఆప్యాయంగా ఉండే లెజినోవా, పవన్ కోసం హిందూ మతాన్ని స్వీకరించారని చెబుతున్నారు. ఉన్నట్లుండి సోమవారం రాత్రి ప్రకటన రావడంతో ఇప్పటికీ అభిమానులు షాక్‌లోనే ఉన్నారు.
Astrologer Venu Swamy had predicted this a long time ago.#PawanKalyan 💔 pic.twitter.com/bTdmE32cQy
— Filmyscoops (@Filmyscoopss) November 10, 2026