E-Paper
Advertisement

ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధం.. డ్రైవర్ చాకచక్యంతో 33 మంది సేఫ్!

ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధం.. డ్రైవర్ చాకచక్యంతో 33 మంది సేఫ్!
Advertisement

Prakasam Bus Fire: అర్ధరాత్రి వేళ.. ప్రయాణికులంతా హాయిగా నిద్రపోతున్నారు. గమ్యస్థానానికి చేరుకోవాల్సిన బస్సు హైవేపై వేగంగా దూసుకెళ్తోంది. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం! మరుక్షణంలోనే మంటలు చెలరేగాయి. కాసేపట్లోనే బస్సు నిప్పుల కొలిమిలా మారి బూడిదైపోయింది. కానీ, డ్రైవర్ చూపిన సమయస్ఫూర్తి వల్ల 33 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

టైరు పేలి చెలరేగిన మంటలు

Advertisement

ఈ భయానక సంఘటన ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం చుండి సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. కడప నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిన్న అర్ధరాత్రి చుండి పరిసర ప్రాంతాలకు చేరుకోగానే ఒక్కసారిగా టైరు పేలిపోయింది. ఆ ఘర్షణకు మంటలు వ్యాపించి బస్సు వేగంగా కాలుడం ప్రారంభమైంది.

దేవుడిలా మారిన డ్రైవర్

Advertisement

ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన డ్రైవర్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను కేకలేసి నిద్రలేపాడు. ఏమాత్రం తొక్కిసలాట జరగకుండా, ఎవరికీ గాయాలు కాకుండా 33 మంది ప్రయాణికులను వెంటవెంటనే కిందకు దించేశాడు.

క్షణాల్లో బూడిదైన బస్సు

ప్రయాణికులంతా కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు తీవ్రమై బస్సు మొత్తం వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికుల లగేజీ కాలిపోయినప్పటికీ, చావు నోటి దాకా వెళ్లి ప్రాణాలతో తిరిగి వచ్చామన్న ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించకపోయి ఉంటే పెద్ద ప్రాణనష్టం జరిగి ఉండేదని, అతడే తమను కాపాడిన దేవుడని ప్రయాణికులు కంటినీటితో కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: హైదరాబాద్‌లో కలకలం.. లోన్‌ యాప్‌ వేధింపులతో కానిస్టేబుల్ ఆత్మహత్య

Tags

Related News

చిత్తూరులో దారుణం.. ఇచ్చిన డబ్బులు అడిగినందుకు కారుతో గుద్ది దారుణ హత్య!

పులివెందులలో టీడీపీ రిగ్గింగ్ వీడియోలు.. బయటపెట్టిన మాజీ మంత్రి పేర్ని నాని!

కన్నీటి సంద్రంలో కోనసీమ రైతన్నలు.. ఇంకా అందని ప్రభుత్వ పరిహారం!

కూటమి పార్టీ ఘనవిజయానికి అసలు కారణం అదే.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్!

రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా పాత పెన్షన్! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల!

విజయనగరం జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల.. పూర్తి షెడ్యూల్ విడుదల!

Big Stories

Advertisement
×