AP SSC Exams: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విద్యార్ధులకు కూటమి సర్కార్ మరో అప్డేట్ ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెలితే.. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ‘ఫీజు షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల అంటే నవంబర్ 11 నుంచి 25 వరకు 10వ తరగతి పరీక్షల ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఆలస్యంగా చెల్లించే వారికి నవంబర్ 26 నుంచి రూ.50. రుసుముతో పాటు.. డిసెంబర్ 3 నుంచి రూ.200 ఆలస్య రుసుముతో పదవ తరగతి ఫీజుల చెల్లింపులు చేయవచ్చని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సకాలంలో ఫీజులు చెల్లించి విద్యార్థులకు పరీక్షలకు సిద్దం కాలవాలని కూటమి సర్కార్ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న పాఠశాల లాగిన్ ఐడీల ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో గత సంవత్సరం కంటే ఈ సారీ మెరుగైన ఫలితాలు సాదించాలని ప్రభుత్వం పేర్కోంది. ఇందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఊపాద్యాయులందరూ కలిసి విద్యార్ధుల పట్ల తుగుశ్రద్ద వహించి విద్యార్ధులను సిద్దం చేయాలని తెలిపింది. రానున్న రోజులకు అనుగునంగా త్వరగా పాఠాలు పూర్తి చేసి విద్యార్థులు ఓత్తిడికి గురి కాకుండా పరీక్షలకు సిద్దపడేలా చర్యలు చేపట్టాలని సర్కార్ క్లారిటీ ఇచ్చింది.
Also read: సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్-కారు ఢీకొని తండ్రి, కూతురు మృతి!