E-Paper
Advertisement

హైదరాబాద్‌పై కాలుష్య పంజా.. దీపావళితో భారీగా పడిపోయిన గాలి నాణ్యత!

హైదరాబాద్‌పై కాలుష్య పంజా..  దీపావళితో భారీగా పడిపోయిన గాలి నాణ్యత!
Advertisement

Hyderabad Air Pollution: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు ఆహ్లాదకర వాతావరణానికి పేరుగాంచిన హైదరాబాద్‌లో ప్రస్తుతం గాలి నాణ్యత ఆందోళనకర స్థాయికి పడిపోయింది. దీపావళిని పురస్కరించుకొని పటాసులు పేల్చడంతో ఈనెల 8న నగర సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 321కి చేరింది. ఈ నెల 9న రాత్రి వరకు 185 ఏక్యూఐకి చేరింది. పండుగను పురస్కరించుకి ఈ పరిస్థితి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రజల ఆరోగ్యానికి ముప్పు..

Advertisement

గాలిలోని సూక్ష్మ ధూళి కణాలైన పీఎం 2.5 స్థాయి ఈ నెల 8న223మైక్రోగ్రాములకు చేరింది. సాధారణ పరిమితి 60 మైక్రోగ్రాములు కాగా, పీఎం 10 స్థాయి 264 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఈనెల 9న పీఎం 2.5 స్థాయి 104 మైక్రో గ్రాములుగా, పీఎం 10 స్థాయి 129 మైక్రోగ్రాములుగా నమోదైందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్పష్టం చేసింది. ఈ స్థాయి లు ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఐటీ కారిడార్‌లో కాలుష్య హాట్‌స్పాట్స్..

Advertisement

నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అధికంగా నమోదైంది. ఈ నెల 8న ఇందిరానగర్ లో ఏక్యూఐ 229, ఏపీజీఓస్ కూప్ హెచ్ఎస్జీ సొసైటీ, జనార్దన హిల్స్ లో 224,కూకట్ పల్లిలో 222, చిత్రపురికాలనీ, డీడీ కాలనీలో 215, ప్రకాశ్ నగర్ లో 211, పోచమ్మ బాగ్ కాలనీలో 207, శిల్పవ్యాలీలో 206, చంచల్ గూడ 205, గోషామాల్ లో 203గా నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ పరిసరాలు కాలుష్య హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయని పర్యావరణ వెత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాలుష్య పంజాలపై నిపుణుల వార్నింగ్

కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. పండుగల సమయంతో పటాకులు కాల్చడంతో పాటు వేస్టేజీని కాల్చోద్దని, వాహనల వాడకాన్ని సైతం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు సైతం విస్తృతం చేయాలని పేర్కొంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సైతం తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చర్యలు కఠినతరం చేయాలని పలువురు కోరుతున్నారు. లేకుంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధం.. డ్రైవర్ చాకచక్యంతో 33 మంది సేఫ్!

Tags

Related News

హైదరాబాద్‌లో కలకలం.. లోన్‌ యాప్‌ వేధింపులతో కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రేమ నిరాకరించడంతో యువతి ఇంట్లో.. ప్రియుడు ఏం చేశాడంటే, వనస్థలిపురంలో దారుణం

తెలంగాణకు వణికిస్తున్న శీతల గాలులు.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు, 29 జిల్లాలకు అలర్ట్‌

తెలంగాణలో జనగణనకు షెడ్యూల్ ఖరారు.. ముఖ్య తేదీలు ఇవే..?

గ్రామ పంచాయతీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు!

బెట్టింగ్ కోసం దొంగగా మారిన తాపీ మేస్త్రీ.. తాడుతో చొరబడి ఎం చేసాడో తెలుసా..?

కేసీఆర్ తర్వాత అత్యధిక సార్లు గెలిచింది నేనే: దయాకర్ రావు!

Big Stories

Advertisement
×