Ravichandran Ashwin On Jaiswal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 వేలం (Indian Premier League 2027 Auction) దగ్గర పడుతున్న నేపథ్యంలో 10 జట్ల మధ్య ట్రేడ్ ప్రక్రియ చాలా వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ లాంటి ఫ్యూచర్ స్టార్ రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టులోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ అంశంపై తాజాగా రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చిన తర్వాత.. హీరోలో ఉన్న యశస్వి జైస్వాల్ జీరో అయిపోయాడని వ్యాఖ్యానించాడు.
అతన్ని ఓ పిచ్చి కుక్కలాగా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ట్రీట్ చేస్తోందని ఫైర్ అయ్యాడు. 15 ఏళ్ల కుర్రాడి ముందు డమ్మీని చేసి అతని జీవితంతో ఆడుకుంటోందని ఆగ్రహించాడు. అందుకే బయటకు వెళ్లేందుకు చూస్తున్నాడని వ్యాఖ్యానించాడు. నిజంగానే యశస్వి జైస్వాల్ మరో జట్టుకు వెళితే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రవిచంద్రన్ అశ్విన్ హెచ్చరించాడు.
15 ఏళ్ల టీనేజ్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ వచ్చిన తర్వాత భయంకరంగా ఉన్న యశస్వి జైస్వాల్ పూర్తిగా మరుగున పడిపోయాడని రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. యశస్వి జైస్వాల్ అద్భుతమైన టాలెంట్ ఉన్నవాడని.. పేద కుటుంబం నుంచి వచ్చిన వాడని పేర్కొన్నాడు. ఎప్పుడైతే వైభవ్ సూర్య వంశీ రాజస్థాన్ రాయల్స్ లోకి వచ్చాడో… అప్పటి నుంచి యశస్వి జైస్వాల్ అనామక ప్లేయర్ గా మారిపోయాడని తెలిపాడు. అతన్ని యాజమాన్యం కూడా చిన్నచూపు చూసిందని ఫైర్ అయ్యాడు.
ఈ ఒత్తిడి నేపథ్యంలో సరిగ్గా అతడు కూడా బ్యాటింగ్ చేయలేదని… 140 స్ట్రైక్ రేటు తో మాత్రమే బ్యాటింగ్ చేస్తున్నాడని గుర్తు చేశాడు. అందరూ వైభవ్ అని అందరూ మాట్లాడుకోవడంతో తన సహజమైన బ్యాటింగ్ స్టైల్ కూడా యశస్వి జైస్వాల్ కోల్పోయాడని తెలిపాడు. అందుకే పక్కింటి చూపులు చూస్తున్నాడని వివరించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడి లక్నో సూపర్ జెయింట్స్ లోకి వెళ్తే యశస్వి జైస్వాల్ కు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయని వివరించాడు. ఆ జట్టులోకి వెళితే కెప్టెన్సీ కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలిపాడు. కానీ, లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా దుర్మార్గుడని, అతని టార్చర్ మరింత డేంజర్ గా ఉంటుందని హెచ్చరించాడు.