E-Paper
Advertisement

Sarpanch Elections: ఆ విలేజ్‌లో సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్.. ఎకగ్రీవంగా ఎన్నిక, గెలుపు సంబరాల్లో గ్రామస్థులు

Sarpanch Elections: ఆ విలేజ్‌లో సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్.. ఎకగ్రీవంగా ఎన్నిక, గెలుపు సంబరాల్లో గ్రామస్థులు
Advertisement

Sarpanch Elections: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజునే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ప్రత్యేక ఘటన చోటుచేసుకుంది. రుద్రంగి మండలం, రుప్లా నాయక్ తండాలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది. ఎలాంటి పోటీ లేకుండా గ్రామస్తులు తమ సర్పంచ్‌ను ఎన్నుకోవడమే కాదు.. వెంటనే గెలుపు సంబరాలు కూడా చేసుకున్నారు. రుప్లా తండా గ్రామంలో సుమారుగా 502 మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. ఈ గ్రామ తండాను అభివృద్ధి చేసి తీరుతానని గ్రామ పెద్దల ముందు జవహర్ లాల్ నాయక్ ముందుకు వచ్చారు. దీంతో గ్రామంలోని ప్రజలు, పార్టీల సంబంధం లేకుండా.. అతీతంగా ఏకతాటిపై నిలిచారు.

గ్రామానికి చెందిన పెద్దమనిషిగా.. ప్రజలందరి సమస్యలు తెలిసిన వ్యక్తిగా జవహర్ లాల్ నాయక్ ఉన్నారు. ఈ కారణాన ఆయనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామ పెద్దలు, ప్రజలు తెలిపారు. దీంతో రుప్లా తండా పంచాయతీ జిల్లాలోనే మొట్టమొదటి ఏకగ్రీవ పంచాయతీగా నిలిచింది. ఈ ఏకగ్రీవ నిర్ణయం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

సర్పంచ్ గా ఎన్నికైన జవహర్ లాల్ నాయక్ ను పంచాయతీ ప్రజలు అభినందనలు తెలిపారు. సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా జవహర్ లాల్ నాయక్ మాట్లాడుతూ… పంచాయతీ పరిధిలోని అభివృద్ధి పనుల కోసం, ప్రజల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం గ్రామ పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పంచాయతీకి మొదటి విడుతలో ఎన్నికలు జరుగుతుండడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. గ్రామస్తులు ముందుగా అనుకున్న మాట ప్రకారం, నామినేషన్లు ఎవరూ వేయకుండా ఈ ఏకగ్రీవం ప్రక్రియను కొనసాగిస్తారో లేదో చూడాలి.

Advertisement

ALSO READ: Himalayan Royal Enfield: రోడ్డుపై ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ సౌండ్ మొదలైతే… గాలి కూడా పక్కకు తప్పుకోవాలి

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×