BigTV English

Lion Killed a man in Tirupati: తిరుపతిలో దారుణం.. సింహం దాడిలో వ్యక్తి మృతి

Lion Killed a man in Tirupati: తిరుపతిలో దారుణం.. సింహం దాడిలో వ్యక్తి మృతి

Lion attacked on Man in Tirupati:


తిరుపతిలో జూ పార్క్‌లో దారుణం చోటు చేసుకుంది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తిపై సింహం దాడి చేసింది. ఈ దాడిలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సింహం అరుపులతో ఆ వ్యక్తి భయంతో చెట్టు ఎక్కి.. అదుపు తప్పి కిందపడిపోయాడు. అది గమనించిన సింహం అతడిపై ఒక్కసారిగా దూకి దాడి చేసింది. ఈ దాడిలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

తిరుపతి జిల్లాలోని శ్రీ వేంకటేశ్వర జూ పార్క్‌ను రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్‌ గుర్జర్‌ సందర్శించడానికి వచ్చారు. సెల్ఫీ కోసం నిబంధనలు ఉల్లంఘించి లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. అందులోకి వెళ్లిన అతనిపై సింహం దాడి చేసింది. మెడ భాగంలో కొరకడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు . ప్రహ్లాద్ గుర్జార్ వృత్తిరీత్యా డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చినట్లు వారు గుర్తించారు.


వెంటనే అప్రమత్తమైన పార్క్‌ సిబ్బంది సందర్శకులను బయటకు పంపంది. అంతకు ముందే జూలో ఉన్న సందర్శకులకు సైతం అనుమతి నిరాకరించారు. విషయం తెలిసిన తిరుపతి రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×