Big Stories

Avinash Reddy: అవినాష్ రెడ్డికి బెయిల్.. కండిషన్స్ అప్లై..

avinash high court

Avinash Reddy Latest News(Andhra news today) : కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. అయితే, కొన్ని కండిషన్లు విధించింది. జూన్ 19 వరకు ప్రతీ శనివారం సీబీఐ ముందు హాజరుకావాలని.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.15 మధ్య అటెండ్ అవ్వాలని షరతు పెట్టింది. సాక్ష్యాలను అవినాష్ రెడ్డి తారుమారు చేయకూడదని.. సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. అలాగే, సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదని తెలిపింది.

- Advertisement -

ఈ కేసులో కస్టడీ విచారణ అవసరం లేదని తెలిపింది హైకోర్టు. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలంది హైకోర్టు. బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లోచ్చని సీబీఐకి సూచించింది. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేయాలని తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అవినాష్‌కు వ్యతిరేకంగా సీబీఐ సాక్షాలు చూపలేకపోయిందంటూ అభిప్రాయపడింది హైకోర్టు.

- Advertisement -

అంతకుముందు.. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో బుధవారం వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయవద్దని CBIని ఆదేశిస్తూ గతవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ముందస్తు బెయిల్‌పై ఇవాళ తుది తీర్పు వెల్లడించింది.

అవినాష్‌రెడ్డి విచారణకు సహకరించడం లేదని సీబీఐ తరఫు న్యాయవాది గతంలో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో మొదటి నుంచీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తును జాప్యం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. నోటీసు ఇచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పి విచారణకు హాజరుకావడం లేదని తెలిపారు. కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేస్తూ అవినాష్ జాప్యం చేస్తున్నారని.. సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అయితే అవినాష్ రెడ్డి విషయంలో హైకోర్టు సీబీఐని తప్పుపట్టింది. సామాన్యుల కేసుల్లోనూ ఇంత సమయం తీసుకుంటారా? అని సీబీఐ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అసలు వివేకా హత్యకు ప్రధాన కారణమేంటని ప్రశ్నించింది. రాజకీయ ఉద్దేశాలే వివేకా హత్యకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది సీబీఐ. అవినాష్‌ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయని.. రాజకీయంగా పైచేయి సాధించాలని అవినాష్ భావించారని సీబీఐ కోర్టుకు తెలిపింది.

ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.. అవినాష్‌రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా.. మే 31 వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ముందస్తు బెయిల్ ఇస్తూ తుదితీర్పు ఇచ్చింది. దీంతో, కొంతకాలంగా అవినాష్‌రెడ్డి బెయిల్, అరెస్ట్‌పై కొనసాగుతున్న టెన్షన్ కొలిక్కివచ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News