BigTV English

Rahul Gandhi: ఐయామ్ కామన్‌మేన్.. ఎయిర్‌పోర్టులో రాహుల్ పడిగాపులు..

Rahul Gandhi: ఐయామ్ కామన్‌మేన్.. ఎయిర్‌పోర్టులో రాహుల్ పడిగాపులు..
rahul gandhi

Rahul Gandhi: ఇమ్మిగ్రేషన్‌ అనుమతుల కోసం శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో రాహుల్‌ గాంధీ 2 గంటలు నిరీక్షించాల్సి వచ్చింది. వారం రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ అమెరికా వెళ్లారు. వారం రోజుల్లో 3 నగరాల్లో రాహుల్‌ పర్యటించనున్నారు.


శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో.. ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఛైర్‌పర్సన్‌ శాం పిట్రోడా, ఇతర సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. ఇమ్మిగ్రేషన్‌ అనుమతుల కోసం రాహుల్‌ దాదాపు 2 గంటలు నిరీక్షించాల్సి వచ్చింది. అదే విమానంలో ఆయనతోపాటు వచ్చిన ఇతర ప్రయాణికులు అక్కడ రాహుల్‌తో సెల్ఫీలు తీసుకున్నారు.

క్యూలో ఎందుకు నిల్చొని ఉన్నారని కొందరు ప్రశ్నించగా తానిప్పుడు ఎంపీని కాదని అన్నారు. సామాన్యుడిలా ఇలా నిరీక్షించడాన్ని ఇష్టపడతానంటూ రాహుల్ సమాధానమిచ్చారు.


రాహుల్‌ తన పర్యటనలో భాగంగా స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు, హక్కుల కార్యకర్తలతో ముచ్చటించారు. అనంతరం ప్రవాస భారతీయులతో మాట్లాడారు. అమెరికా పర్యటనలో ‘మొహబ్బత్‌ కీ దుకాణ్’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… ప్రధాని మోదీ తన ప్రత్యర్థుల్ని, ప్రజల్ని భయపెట్టేందుకు దర్యాప్తు సంస్థలను ఉపయోగించు కుంటున్నారని ఆరోపించారు. తనకు అన్నీ తెలుసు అనే అపోహ ఉన్న వాళ్లలో మోదీ కూడా ఒకరన్న రాహుల్.. ఈ విశ్వం ఎలా నడుస్తుందో దేవుడికి కూడా మోదీ వివరించగలరని ఎద్దేవా చేశారు. భారత రాజకీయాల్లో ప్రతీదానిని BJP, RSS శాసిస్తున్నాయని ఆరోపించారు రాహుల్ గాంధీ. తన భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించిందని అన్నారు.

రాహుల్ అమెరికా పర్యటనలో విలేకరుల సమావేశంలో పాల్గొనడంతో పాటు శాసనకర్తలతో, మేధావులతో సమావేశమవుతారు. జూన్‌ 4న న్యూయార్క్‌లో జరిగే బహిరంగ సభతో ఆయన పర్యటన ముగుస్తుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×